కూకట్‌పల్లి నిజాంపేటకు చెందిన అరుణ్ కుమార్, పావని దంపతుల పిల్లలు చైతన్య, జితిన్. క్రాంతి కుమార్, లీనా దంపతుల పిల్లలు నిశాంత్, లాస్య, ఇష్యా తమ కిడ్డీ బ్యాంకులలో దాచుకున్న సొమ్ము రూ.15,900 సైన్యానికి విరాళం ఇచ్చేందుకు ముందుకొచ్చారు. తాతయ్య మోహనరావు సహాయంతో ఆర్మీ సంక్షేమ నిధుల ఖాతాలో ఈ మొత్తాన్ని జమ చేశారు. దేశం కోసం నిరంతరం పని చేస్తూ అమరులైన సైనికుల కుటుంబాలకు చేసిన ఈ సహాయం ఎంతో తృప్తిని ఇచ్చిందని చిన్నారులు అన్నారు. వీలైనంత సహాయాన్ని చేసేందుకు ప్రజలు ముందుకు రావాలని కోరారు.