తెలంగాణ

telangana

ETV Bharat / state

భక్తులపై దాడి.. పోలీసులు రాగానే వ్యక్తిని ఎత్తుకెళ్లిన యువకులు - ఆంధ్రప్రదేశ్ న్యూస్

Kidnapping Commotion at Ammavari Temple: ఏపీలోని గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద కిడ్నాప్ కలకలం రేగింది. ఆలయానికి వచ్చిన విజయవాడ భక్తులపై యువకులు దాడి చేశారు. దుర్గారావు అనే వ్యక్తితో గొడవకు దిగి, అతడిపై దాడి చేశారు. దీంతో గొడవ పెద్దదైంది. వెంటనే అక్కడికి వచ్చిన కానిస్టేబుళ్లను చూసి, దుర్గారావు వెంట ఉన్న అంబటి తేజను కారులో ఎక్కించుకుని సదరు యువకులు పరారయ్యారు. దీనిపై పోలీసులకు సమాచారం ఇవ్వగా వారిని పట్టుకున్నారు.

Kidnapping Commotion at Ammavari Temple
Kidnapping Commotion at Ammavari Temple

By

Published : Nov 28, 2022, 12:26 PM IST

Kidnapping Commotion at Ammavari Temple: ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద కిడ్నాప్ కలకలం రేగింది. ఆలయానికి వచ్చిన విజయవాడ భక్తులపై దాడి చేసిన యువకులు.. అంబటి తేజ అనే వ్యక్తిని కారులో ఎక్కించుకుని పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు. విజయవాడ వన్‌టౌన్‌కు చెందిన భక్తులు ఆదివారం అమ్మవారి దర్శనానికి వచ్చిన సమయంలో, కొందరు యువకులు రెచ్చిపోయారు.

కుమారుడిని ఓ దెబ్బేసిన మజ్జి దుర్గారావు అనే వ్యక్తితో, పిల్లాడిని ఎందుకు కొట్టావంటూ గొడవకు దిగి, అతడిపై దాడికి పాల్పడ్డారు. బాధితుడి బంధువులు అక్కడికి రావడంతో గొడవ పెద్దదైంది. వెంటనే అక్కడికి వచ్చిన కానిస్టేబుళ్లను చూసి, దుర్గారావు వెంట ఉన్న అంబటి తేజను కారులో ఎక్కించుకుని సదరు యువకులు పరారయ్యారు.

దీనిపై దుగ్గిరాల ఎస్సై శ్రీనివాసరెడ్డికి పోలీసులు సమాచారం ఇచ్చారు. అనంతరం సమీప పోలీస్ స్టేషన్లను ఆయన అప్రమత్తం చేయగా, తాడేపల్లిలోని సీఎం నివాసం వద్ద యువకుల కారును అడ్డగించారు. ఎస్సై అక్కడకు చేరుకుని కారులో ఉన్న యువకులను, తేజను అదుపులోకి తీసుకుని దుగ్గిరాలకు తీసుకు వచ్చారు. కారులో ఉన్న నలుగురిలో తాడేపల్లి, విజయవాడకు చెందిన వారున్నారని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం విచారణ జరుగుతోందని త్వరలోనే అన్ని విషయాలు చెబుతామని పోలీసులు చెప్పారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details