లండన్ నుంచి హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ప్రవీణ్ అనే వ్యక్తిని క్యాబ్ డ్రైవర్ కిడ్నాప్ చేసినట్లు అతని తండ్రి శేషగిరిరావు ఉదయం 5గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా అసలు ప్రవీణ్ లండన్‌కు వెళ్లలేదని శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి వెల్లడించారు. ప్రవీణ్ కావాలనే కిడ్నాప్ డ్రామా ఆడినట్లుగా తమ దర్యాప్తులో తేలిందని డీసీపీ తెలిపారు. పెళ్లి ఇష్టంలేక అసలు గుట్టు ఎక్కడ బయటపడుతోందనే.. కిడ్నాప్ నాటకమాడినట్లు తెలుస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రవీణ్ చెన్నైలో ఉన్నట్లుగా తెలుస్తోందన్నారు.
కిడ్నాప్ కానేకాదు: డీసీపీ ప్రకాశ్ రెడ్డి - dcp
శంషాబాద్ విమానాశ్రయంలో ఓ యువకుణ్ని క్యాబ్ డ్రైవర్ కిడ్నాప్ చేసినట్లుగా వచ్చిన ఫిర్యాదులో నిజం లేదని శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి తేల్చిచెప్పారు. యువకుడు ఆడిన నాటకంగా గుర్తించారు.
డీసీపీ ప్రకాశ్ రెడ్డి