సోమవారం కిడ్నాప్‌కు గురైన జషిత్ ఆచూకీ ఎట్టకేలకు లభించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం కుతుకులూరు వద్ద జషిత్ ఆచూకీ లభ్యమైంది. బాలుడు జషిత్‌ను అగంతుకులు వదిలివెళ్లారు. చిన్నారి క్షేమంగా ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. తెల్లవారుజామున బాలుడిని వదిలివెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. జషిత్ కిడ్నాప్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. పోలీసులు 17 బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు.
కిడ్నాప్ కథ సుఖాంతం... జషిత్ ఆచూకీ లభ్యం - kidnap
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం స్పష్టించిన చిన్నారి జషిత్ అపహరణ కథ సుఖాంతంగా ముగిసింది. ఎట్టకేలకు చిన్నారి ఆచూకీ లభించింది.

కిడ్నాప్ కథ సుఖాంతం... జషిత్ ఆచూకీ లభ్యం
కిడ్నాప్ కథ సుఖాంతం... జషిత్ ఆచూకీ లభ్యం