తెలంగాణలో (telangana) రానున్న ఖరీఫ్ సీజన్‌లో రికార్డు స్థాయిలో పంట దిగుబడి వస్తుందని (Kharif season crop yield) రాష్ట్ర అర్థ, గణాంకశాఖ (State Economics and Statistics Department) నివేదిక పంపింది. దిగుబడి బాగున్నా వాటిని మద్దతు ధరకు (minimum support price) కొనుగోలు చేయడమే సమస్యగా మారింది. సుమారు 38 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేసింది. అయితే ఇందులో 40 లక్షల టన్నుల బియ్యం(60 లక్షల టన్నుల ధాన్యం) మాత్రమే కొంటామని ‘భారత ఆహార సంస్థ’(ఎఫ్‌సీఐ) ఇప్పటికే తెలిపింది. మిగిలిన 78 లక్షల టన్నుల ధాన్యంలో రైతులు సొంతానికి కొంత వాడుకోగా మిగిలిన దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొంటుందా లేక వ్యాపారులకు వదిలేస్తుందా అనేది వేచిచూడాలి. పంటల సాగు విస్తీర్ణం, దిగుబడులు, ఉత్పాదకతపై ఈ శాఖ ఏటా నాలుగుసార్లు ముందస్తు అంచనాల నివేదికలను తయారుచేస్తుంది. ఈ ఏడాది(2021-22) వానాకాలంలో రాష్ట్రంలో పండే పంటలపై తొలి నివేదికను కేంద్రానికి పంపింది.
నివేదికలోని ముఖ్యాంశాలు
* ఆహార ధాన్యాలు కోటీ 9 లక్షల టన్నులు, పప్పుధాన్యాలు 5.80 లక్షల టన్నులు, నూనెగింజలు 2.70 లక్షల టన్నుల దిగుబడి వస్తుంది.