ఖమ్మం నగరాన్ని మరింత అభివృద్ధి చేయాలని నూతన మేయర్, ఉప మేయర్‌ను మంత్రి కేటీఆర్(Minister ktr) కోరారు. ఇటీవల ఎన్నికైన మేయర్ పునుకొల్లు నీరజ, ఉప మేయర్ ఫాతిమా జోహారా ఇవాళ హైదరాబాద్‌లో మంత్రిని కలిశారు. మేయర్, ఉపమేయర్ను కేటీఆర్ అభినందించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఖమ్మం నగరం చాలా అభివృద్ధి చెందిందని.. దాన్ని కొనసాగించేందుకు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు.
KTR: ఖమ్మం నగరాన్ని మరింత అభివృద్ధి చేయాలి: కేటీఆర్ - తెలంగాణ వార్తలు
మంత్రి కేటీఆర్(Minister ktr)ను ఖమ్మం మేయర్, ఉపమేయర్ హైదరాబాద్‌లో ఇవాళ కలిశారు. ఖమ్మం నగరాన్ని మరింత అభివృద్ధి చేయాలని మంత్రి వారిని కోరారు.
తెరాస, కేటీఆర్
మంత్రి కేటీఆర్‌తో పాటు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి, ఖమ్మం కలెక్టర్ ఆర్.వి.కర్ణన్, కార్పొరేషన్ కమిషనర్ అనురాగ్ జయం తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:HARISH RAO: రాజకీయ కుట్రలను ప్రజలు గమనించాలి: మంత్రి హరీశ్