తెలంగాణ

telangana

ETV Bharat / state

LIVE UPDATES : అధికారంలోకి వస్తే అగ్నిపథ్‌ను రద్దు చేస్తాం: కేసీఆర్‌ - నేడు ఖమ్మంలో భారాస ఆవిర్భావ సభ

Khammam BRS Public Meeting
Khammam BRS Public Meeting

By

Published : Jan 18, 2023, 9:20 AM IST

Updated : Jan 18, 2023, 5:36 PM IST

17:24 January 18

అధికారంలోకి వస్తే అగ్నిపథ్‌ను రద్దు చేస్తాం: కేసీఆర్‌

  • తెలంగాణ మోడల్‌ దేశమంతా అమలు చేస్తాం: కేసీఆర్‌
  • భారాస అధికారంలోకి వస్తే దేశమంతా ఉచిత విద్యుత్‌: కేసీఆర్‌
  • నష్టాలు సమాజానికి.. లాభాలు ప్రైవేటు వ్యక్తులకా?: కేసీఆర్‌
  • ఎల్‌ఐసీని అడ్డికి పావుసేరుకు అమ్ముతారా?: కేసీఆర్‌
  • ఎల్‌ఐసీ కోసం భారాస పోరాడుతుంది: కేసీఆర్‌
  • ఎల్‌ఐసీ ఏజెంట్లు, ఉద్యోగులు భారాసను బలపరచాలి: కేసీఆర్‌
  • కరెంటు కార్మికులారా? పిడికిలి బిగించండి: కేసీఆర్‌
  • విద్యుత్‌ను ప్రభుత్వ రంగంలోనే ఉంచుతాం: కేసీఆర్‌
  • ఇంకా దేశంలో లక్ష కోట్ల మెగావాట్ల జల విద్యుత్‌కు అవకాశం ఉంది: కేసీఆర్‌
  • అవసరం ఉన్నచోట వ్యాపారం చేయడం ప్రభుత్వ విధానం: కేసీఆర్‌
  • దళితబంధును దేశమంతా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నా: కేసీఆర్‌
  • మీరు ఇవ్వకపోతే మేము దేశమంతా దళితబంధు ఇస్తాం: కేసీఆర్‌
  • దేశంలో మతపిచ్చి లేపుతున్నారు: కేసీఆర్‌
  • విశాఖ ఉక్కును ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటుపరం కానివ్వం: కేసీఆర్‌
  • విశాఖ ఉక్కును మోదీ అమ్మితే మేము అధికారంలోకి వచ్చాక కొంటాం: కేసీఆర్‌
  • లొడలొడ మాట్లాడే ప్రధానికి మంచి నీళ్లు ఇవ్వడం చేతకాదా?: కేసీఆర్‌
  • మేక్ ఇన్‌ ఇండియా.. జోక్‌ ఇన్‌ ఇండియాగా మారింది: కేసీఆర్‌
  • అధికారంలోకి వస్తే అగ్నిపథ్‌ను రద్దు చేస్తాం: కేసీఆర్‌
  • కొద్దిరోజుల్లోనే భారాస విధానాలు ప్రజల ముందుంచుతాం: కేసీఆర్‌
  • 150 మంది మేధావులు భారాస విధానాలు రూపొందిస్తున్నారు: కేసీఆర్‌

17:23 January 18

దేశ దుస్థితికి కాంగ్రెస్‌, భాజపానే కారణం: కేసీఆర్‌

  • దేశ దుస్థితికి కాంగ్రెస్‌, భాజపానే కారణం: కేసీఆర్‌
  • కాంగ్రెస్‌ అధికారంలో ఉంటే భాజపాను తిడుతుంది: కేసీఆర్‌
  • భాజపా అధికారంలో ఉంటే కాంగ్రెస్‌ను తిడుతుంది: కేసీఆర్‌
  • దేశంలో 4.10 లక్షల మెగావాట్ల విద్యుత్‌ సామర్థ్యం ఉంది: కేసీఆర్‌
  • ఎప్పుడూ 2 లక్షల మెగావాట్ల విద్యుత్‌కు మించి వాడలేదు: కేసీఆర్‌
  • రోజూ వేలాది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నందుకు సిగ్గుపడాలి: కేసీఆర్‌
  • ఎన్‌పీఏల పేరుతో రూ.14 లక్షల కోట్లు దోచిపెట్టారు: కేసీఆర్‌

17:03 January 18

చాటలో తవుడు పోసి కుక్కల కొట్లాట పెట్టినట్లుంది కేంద్ర వైఖరి : కేసీఆర్‌

  • ఖమ్మం చరిత్రలోనే ఇది అద్భుత భారీ బహిరంగ సభ: కేసీఆర్‌
  • ఖమ్మం సభ దేశంలో ప్రబల మార్పునకు సంకేతం: కేసీఆర్‌
  • ఖమ్మంలోని ప్రతి పంచాయతీకి రూ.10 లక్షల చొప్పున మంజూరు: కేసీఆర్‌
  • 589 గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున నిధులు: కేసీఆర్‌
  • 10 వేల జనాభా దాటిన మేజర్ పంచాయతీలకు రూ.10 కోట్ల చొప్పున నిధులు: కేసీఆర్‌
  • ఖమ్మం జిల్లాలోని మున్సిపాలిటీలకు రూ.30 కోట్ల చొప్పున నిధులు: కేసీఆర్‌
  • ఖమ్మం మున్సిపాలిటీకి రూ.50 కోట్లు మంజూరు: కేసీఆర్‌
  • ఖమ్మం మున్నేరు నదిపై వంతెన మంజూరు: కేసీఆర్‌
  • ఖమ్మం జిల్లాకు ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాల మంజూరు: కేసీఆర్‌
  • జర్నలిస్టులకు ఖమ్మం జిల్లా కేంద్రంలో నెలలోగా ఇళ్ల స్థలాలు: కేసీఆర్‌
  • ప్రభుత్వ స్థలం దొరక్కపోతే సేకరించైనా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి: కేసీఆర్‌
  • భారాస విధానం, వ్యూహం తర్వాత వివరంగా చెబుతాం: కేసీఆర్‌
  • భారత్‌ అన్ని విధాలా సుసంపన్నమైన దేశం: కేసీఆర్‌
  • జలవనరులు, సాగు భూమి విషయంలో మన దేశమే అగ్రగామి: కేసీఆర్‌
  • కెనడా నుంచి కందిపప్పు దిగుమతి సిగ్గుచేటు కాదా?: కేసీఆర్‌
  • దేశంలో 70 వేల టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి: కేసీఆర్‌
  • కేవలం 20 వేల టీఎంసీలు మాత్రమే వాడుకుంటున్నాం: కేసీఆర్‌
  • దేశానికి నిర్దిష్ట లక్ష్యం లేకుండా పోయింది: కేసీఆర్‌
  • జింబాబ్వేలో 6 వేల టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్ ఉంది: కేసీఆర్‌
  • చైనాలో 5 వేల టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్‌ ఉంది: కేసీఆర్‌
  • మన దేశంలో అతిపెద్దదైన ఒక్క రిజర్వాయర్‌ ఉందా?: కేసీఆర్‌
  • దేశంలో చైతన్యం తెచ్చేందుకు పుట్టిందే భారాస: కేసీఆర్‌
  • బకెట్‌ నీళ్ల కోసం చెన్నై నగరం అర్రులు చాచాలా?: కేసీఆర్‌
  • రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాల అవసరం ఎందుకు వచ్చింది: కేసీఆర్‌
  • చాటలో తవుడు పోసి కుక్కల కొట్లాట పెట్టినట్లుంది కేంద్ర వైఖరి : కేసీఆర్‌
  • డొల్ల మాటలు, కల్ల మాటలతో పొద్దుపుచ్చే పరిపాలన: కేసీఆర్‌

16:54 January 18

సీఎంలను ఇబ్బందులు పెట్టడంలో ప్రధాని బిజీగా ఉన్నారు: కేజ్రీవాల్

  • సీఎం కేసీఆర్‌ను పెద్దన్నగా సంబోధించిన కేజ్రీవాల్
  • ఇవాళ రెండు గొప్ప కార్యక్రమాల్లో పాల్గొన్నాను: కేజ్రీవాల్
  • కంటి వెలుగు అద్భుత కార్యక్రమం: దిల్లీ సీఎం కేజ్రీవాల్
  • కంటి వైద్య పరీక్షలు ఉచితంగా అందించడం గొప్ప విషయం: కేజ్రీవాల్
  • కంటి వెలుగు కార్యక్రమం దిల్లీలోనూ అమలు చేస్తాం: కేజ్రీవాల్‌
  • మేం ఒకరి నుంచి మరొకరం నేర్చుకుంటాం: దిల్లీ సీఎం
  • దిల్లీ మొహల్లా క్లినిక్‌లను ఇక్కడ బస్తీ దవాఖానాగా అమలు చేశారు: కేజ్రీవాల్
  • మొహల్లా క్లినిక్‌ల పరిశీలనకు కేసీఆర్‌ దిల్లీ గల్లీలో తిరిగారు: కేజ్రీవాల్
  • తమిళనాడు సీఎం స్టాలిన్‌ దిల్లీ పాఠశాలలు పరిశీలించారు: కేజ్రీవాల్
  • తమిళనాడులోనూ పాఠశాలలు బాగుచేసుకున్నారు: కేజ్రీవాల్
  • దిల్లీలో ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులు కూడా ప్రభుత్వ స్కూళ్లలో చేరుతున్నారు: కేజ్రీవాల్
  • స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా దేశం వెనుకబడే ఉంది: కేజ్రీవాల్
  • మన తర్వాత స్వాతంత్ర్యం పొందిన సింగపూర్‌ దూసుకెళ్తోంది: కేజ్రీవాల్
  • కేరళలో విద్య, వైద్యం బాగుంటుందని చిన్నప్పటి నుంచి విన్నా: కేజ్రీవాల్
  • మరి మిగతా రాష్ట్రాల్లో ఎందుకు బాగాలేదు: కేజ్రీవాల్
  • గవర్నర్లు సీఎంలను ఇబ్బందులు పెడుతున్నారు: కేజ్రీవాల్
  • గవర్నర్లను మోదీ ఆడిస్తున్నారు: దిల్లీ సీఎం కేజ్రీవాల్
  • గవర్నర్లకు దిల్లీ నుంచి ఒత్తిడి ఉంది: కేజ్రీవాల్
  • సీఎంలను ఇబ్బందులు పెట్టడంలో ప్రధాని బిజీగా ఉన్నారు: కేజ్రీవాల్
  • వచ్చే ఎన్నికలు దేశాన్ని మార్చేందుకు ప్రజలకు మంచి అవకాశం: కేజ్రీవాల్

16:45 January 18

పంజాబ్‌లోనూ తెలంగాణ మాదిరి కార్యక్రమాలు చేపడతాం: భగవంత్‌ మాన్‌

  • పంజాబ్‌లో చరిత్రాత్మక విజయం ఆప్‌ సాధించింది: భగవంత్‌ మాన్‌
  • లూటీ చేయడం.. అమ్మడమే భాజపా సిద్ధాంతం: భగవంత్‌ మాన్‌
  • కేంద్ర సంస్థలు ఎల్‌ఐసీ, రైల్వేశాఖను అమ్మకానికి యత్నం: భగవంత్‌ మాన్‌
  • పంజాబ్‌లోనూ తెలంగాణ మాదిరి కార్యక్రమాలు చేపడతాం: భగవంత్‌ మాన్‌
  • మంచి కార్యక్రమాలు ఎక్కడినుంచైనా నేర్చుకోవచ్చు: భగవంత్‌ మాన్‌
  • అభివృద్ధిలో తెలంగాణ దూసుకెళ్తోంది: భగవంత్ మాన్‌
  • దేశంలోనే తెలంగాణ వెలుగులీనుతోంది: భగవంత్‌ మాన్‌
  • పంజాబ్‌లో అవినీతిని రూపుమాపాం: భగవంత్ మాన్‌
  • అవినీతికి పాల్పడిన నేతలను జైళ్లకు పంపాం: భగవంత్ మాన్‌

16:37 January 18

హామీలు నెరవేర్చకుండా భారతీయ జుమ్లా పార్టీగా మారింది: పంజాబ్‌ సీఎం

  • రాష్ట్రంలో 'కంటి వెలుగు' వంటి మంచి పథకం చేపట్టారు: పంజాబ్‌ సీఎం
  • పెద్దఎత్తున ప్రజలు తరలిరావడం మార్పునకు తొలి అడుగు: పంజాబ్‌ సీఎం
  • దేశం ఎటు వెళ్తుందోననే ఆందోళన నెలకొంది: పంజాబ్‌ సీఎం
  • కేంద్రం యువత, రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు: పంజాబ్‌ సీఎం
  • హామీలు నెరవేర్చకుండా భారతీయ జుమ్లా పార్టీగా మారింది: పంజాబ్‌ సీఎం
  • ఏటా 2 కోట్ల ఉపాధి కల్పిస్తామని మోసం చేశారు: భగవంత్‌ మాన్‌
  • యువతకు ఉపాధి కల్పిస్తామన్న హామీ నెరవేర్చలేదు: భగవంత్‌ మాన్‌
  • రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని మోసం చేశారు: భగవంత్‌ మాన్‌
  • ప్రజల ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని మోసం చేశారు: భగవంత్‌ మాన్‌
  • కొన్ని రాష్ట్రాల్లో కొనుగోళ్లతో అధికారం దక్కించుకునే కుట్ర: భగవంత్‌ మాన్‌
  • దిల్లీ మున్సిపల్ ఎన్నికల్లోనూ కుట్రలు చేశారు: భగవంత్‌ మాన్‌

16:28 January 18

రాబోయే రోజుల్లో కేసీఆర్‌ మరిన్ని మంచి పథకాలు తేవాలి: డి.రాజా

  • తెలంగాణ సాయుధ పోరాట యోధులకు నివాళులర్పిస్తున్నా: డి.రాజా
  • తెలంగాణలో సుపరిపాలన అందుతోంది: డి.రాజా
  • విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది: డి.రాజా
  • రైతుబంధు, దళితబంధు వంటి పథకాలు ఆదర్శం: డి.రాజా
  • రాబోయే రోజుల్లో కేసీఆర్‌ మరిన్ని మంచి పథకాలు తేవాలి: డి.రాజా
  • భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయి: డి.రాజా
  • దేశంలో లౌకికత్వం ప్రమాదంలో పడింది: డి.రాజా
  • భారత్‌.. హిందూ దేశంగా మారే ప్రమాదం కనబడుతోంది: డి.రాజా
  • విద్య, ఆరోగ్యం, ఉద్యోగ అంశాలను కేంద్రం విస్మరిస్తోంది: డి.రాజా
  • మోదీ.. కార్పొరేట్‌ శక్తులకు కొమ్ముకాస్తున్నారు: డి.రాజా
  • భాజపా గవర్నర్‌ వ్యవస్థను దుర్వినియోగం చేస్తోంది: డి.రాజా
  • కేరళ, తమిళనాడు, తెలంగాణలో గవర్నర్లు హద్దులు మీరుతున్నారు: డి.రాజా
  • భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌లకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగాలి: డి.రాజా
  • భాజపాపై ఐక్య పోరాటానికి ఖమ్మం సభ నాంది కావాలి: డి.రాజా
  • భాజపాను ఓడించడమే అందరి ముందున్న కర్తవ్యం: డి.రాజా
  • భాజపా.. దేశాన్ని విచ్ఛిన్నం చేయలేదు: డి.రాజా

16:07 January 18

గుజరాత్‌ నుంచి ప్రధాని కాగలిగితే గుజరాత్‌ను వీడి రారు: అఖిలేష్‌

  • ఖమ్మం సభ నుంచి దేశానికి మంచి సందేశం ఇస్తున్నారు: అఖిలేష్‌
  • సమీకృత కలెక్టరేట్‌ ద్వారా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు: అఖిలేష్‌
  • ఎన్నికైన ప్రభుత్వాలను భాజపా ఇబ్బందులకు గురిచేస్తోంది: అఖిలేష్‌
  • ప్రశ్నించిన నేతలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు: అఖిలేష్‌
  • వచ్చే ఎన్నికల్లో భాజపా ప్రభుత్వం గద్దె దిగడం ఖాయం: అఖిలేష్‌
  • రెండేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న హామీ ఏమైంది: అఖిలేష్‌
  • రైతులకు సరైన మద్దతు ధర లభించట్లేదు: అఖిలేష్‌
  • దేశంలో నిరుద్యోగం బాగా పెరిగింది: అఖిలేష్‌ యాదవ్‌
  • జీ 20 అధ్యక్షత వహించడం భారత్‌కు మంచి అవకాశం: అఖిలేష్‌
  • జీ 20 అంశాన్ని ఎన్నికలకు వాడుకుంటున్నారు: అఖిలేష్‌
  • తెలంగాణలో భాజపాను ప్రక్షాళన చేస్తున్నారు: అఖిలేష్‌
  • యూపీలోనూ భాజపాను గద్దె దింపేందుకు కలిసి పనిచేస్తాం: అఖిలేష్‌
  • ప్రధాని అయ్యే వ్యక్తులు యూపీ తప్పకుండా వస్తారు: అఖిలేష్‌
  • ప్రధాని కావడం కోసమే గుజరాత్‌ నుంచి ఉత్తరప్రదేశ్ వచ్చారు: అఖిలేష్‌
  • గుజరాత్‌ నుంచి ప్రధాని కాగలిగితే గుజరాత్‌ను వీడి రారు: అఖిలేష్‌
  • గంగా ప్రక్షాళన చేస్తామని నమ్మకద్రోహం చేశారు: అఖిలేష్‌
  • తెలంగాణలో ఇంటింటా తాగునీరు, ప్రతి ఎకరాకు సాగునీరు అందుతోంది: అఖిలేష్‌

16:01 January 18

కేరళ సీఎం విజయన్‌ను సన్మానించిన సీఎం కేసీఆర్‌

  • కేరళ సీఎం విజయన్‌ను సన్మానించిన సీఎం కేసీఆర్‌
  • విజయన్‌కు జ్ఞాపిక బహూకరించిన సీఎం కేసీఆర్‌

15:59 January 18

హిందీని రాష్ట్రాలపై రుద్దే ప్రయత్నం జరుగుతోంది: విజయన్‌

  • ఏ భాషకు ఆ భాష ప్రత్యేకమైనది: కేరళ సీఎం విజయన్‌
  • హిందీని రాష్ట్రాలపై రుద్దే ప్రయత్నం జరుగుతోంది: విజయన్‌
  • న్యాయ వ్యవస్థలో కేంద్రం మితిమీరిన జోక్యం చేసుకుంటోంది: విజయన్‌
  • న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీస్తోంది: విజయన్‌
  • రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని మార్చే ప్రయత్నం చేస్తోంది: విజయన్‌
  • ఉపరాష్ట్రపతి కూడా రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడుతున్నారు: విజయన్‌
  • రాష్ట్రాలకు నిధుల పంపకంలో వివక్ష చూపుతున్నారు: కేరళ సీఎం
  • జీడీపీ, పారిశ్రామిక వృద్ధి క్షీణిస్తోంది: కేరళ సీఎం విజయన్
  • విదేశీ మారకనిల్వలు క్రమంగా తరిగిపోతున్నాయి: విజయన్‌
  • పెట్రో ధరల పెంపుతో జనజీవనం అస్తవ్యస్తమైంది: విజయన్‌
  • 80 శాతం ప్రజలు పేదరికంలోకి వెళ్లే దుస్థితి: కేరళ సీఎం

15:49 January 18

కేంద్రంపై పోరాడేందుకు కేసీఆర్‌ నడుం బిగించారు: విజయన్‌

  • కేంద్ర వైఖరితో రాజ్యాంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది: విజయన్‌
  • ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ అనేక చర్యలు చేపడుతోంది: విజయన్‌
  • కేంద్రంపై పోరాడేందుకు కేసీఆర్‌ నడుం బిగించారు: విజయన్‌
  • తెలంగాణ తరహాలోనే కేరళ కూడా అనేక పథకాలు చేపట్టింది: విజయన్‌
  • తెలంగాణ పోరాటాల పురిటిగడ్డ: కేరళ సీఎం విజయన్‌
  • తెలంగాణ సాయుధ పోరాటం భూసంస్కరణలకు కారణమైంది: విజయన్‌
  • స్వాతంత్ర్య సమరంలో పాల్గొనని శక్తులు కేంద్రంలో అధికారంలో ఉన్నాయి: విజయన్‌
  • కార్పొరేట్‌ శక్తులకే కేంద్రం ఊతమిస్తోంది: కేరళ సీఎం విజయన్‌
  • కేంద్ర వైఖరితో లౌకికత్వం ప్రమాదంలో పడుతోంది: కేరళ సీఎం
  • సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేందుకు కేంద్రం యత్నిస్తోంది: కేరళ సీఎం
  • వన్‌ నేషన్‌-వన్‌ ట్యాక్స్‌, వన్‌ నేషన్‌ -వన్‌ ఎలక్షన్‌ వంటి నినాదాలు సమాఖ్య నిర్మాణాన్ని దెబ్బతీస్తున్నాయి: విజయన్‌
  • భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ సంయుక్తంగా దేశాన్ని పాలిస్తున్నాయి: విజయన్‌
  • రాష్ట్రాల హక్కులను కేంద్రం కబళిస్తోంది: కేరళ సీఎం విజయన్‌
  • సమాఖ్య స్ఫూర్తి, ప్రజాస్వామ్యాన్ని కేంద్రం దెబ్బతీస్తోంది: విజయన్‌
  • పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని భాజపా బలహీనపరుస్తోంది: విజయన్‌
  • ఎన్నికైన ప్రభుత్వాలను అనైతిక పద్ధతుల్లో కూలదోస్తోంది: విజయన్‌
  • భిన్నత్వంలో ఏకత్వం అనేది దేశ విశిష్టత: కేరళ సీఎం విజయన్‌

15:36 January 18

ఖమ్మం బీఆర్​ఎస్ ఆవిర్భావ బహిరంగ సభ.. ఒకే వేదికపైకి నలుగురు సీఎంలు, జాతీయ నేతలు

  • ఖమ్మంలో భారాస ఆవిర్భావ బహిరంగ సభ
  • ఒకే వేదికపైకి నలుగురు సీఎంలు, జాతీయ నేతలు
  • భారాస సభకు హాజరైన దిల్లీ, పంజాబ్‌, కేరళ సీఎంలు
  • ఖమ్మం సభకు హాజరైన సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా
  • భారాస ఆవిర్భావ సభకు హాజరైన యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌

15:05 January 18

ఖమ్మం బీఆర్​ఎస్ ఆవిర్భావ బహిరంగ సభ.. సభాస్థలికి చేరుకున్న నలుగురు సీఎంలు

  • ఖమ్మంలో భారాస ఆవిర్భావ బహిరంగ సభ
  • కాసేపట్లో ఒకే వేదికపైకి నలుగురు సీఎంలు, జాతీయ నేతలు
  • భారాస సభకు హాజరైన దిల్లీ, పంజాబ్‌, కేరళ సీఎంలు
  • ఖమ్మం సభకు హాజరైన సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా
  • భారాస ఆవిర్భావ సభకు హాజరైన యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌
  • భారాస సభకు భారీగా చేరుకుంటున్న నేతలు, పార్టీ శ్రేణులు
  • ఖమ్మం: నూతన కలెక్టరేట్ వెనుక 100 ఎకరాల స్థలంలో సభ
  • 16 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి భారీగా జన సమీకరణ

14:17 January 18

ఖమ్మంలో కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం ప్రారంభం

  • ఖమ్మంలో కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం ప్రారంభం
  • ఖమ్మం: కంటివెలుగు కార్యాక్రమాన్ని ప్రారంభించిన సీఎంలు
  • కళ్లద్దాలు అందజేసిన కేసీఆర్‌, కేజ్రీవాల్‌, అఖిలేశ్‌ యాదవ్‌, డి.రాజా
  • కళ్లద్దాలు అందజేసిన పినరయి విజయన్‌, భగవంత్‌ మాన్‌

13:59 January 18

ఖమ్మం సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

  • కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కేజ్రీవాల్, భగవంత్‌మాన్‌
  • కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న పినరయి విజయన్‌, అఖిలేశ్‌
  • ఖమ్మం కలెక్టరేట్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీపీఐ నేత డి.రాజా

13:48 January 18

ఖమ్మం చేరుకున్న కేసీఆర్‌ సహా నలుగురు సీఎంలు

  • నూతన కలెక్టరేట్​ను ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్
  • జాతీయ నేతలతో కలిసి నూతన కలెక్టరేట్​ను ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్
  • అనంతరం ఖమ్మంలో కాసేపట్లో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం
  • 4 రాష్ట్రాల సీఎంల చేతుల మీదుగా కంటివెలుగు కార్యక్రమానికి శ్రీకారం
  • రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి కంటి పరీక్షలు నిర్వహించనున్న ప్రభుత్వం

13:11 January 18

  • యాదాద్రి నుంచి ఖమ్మం సభకు బయలుదేరిన నేతలు
  • ఖమ్మం భారాస సభకు బయలుదేరిన కేసీఆర్‌, కేజ్రీవాల్
  • ఖమ్మం సభకు బయలుదేరిన పినరయి విజయన్‌, భగవంత్‌ మాన్‌
  • ఖమ్మం భారాస సభకు బయలుదేరిన అఖిలేశ్‌ యాదవ్‌, డి.రాజా
  • రెండు హెలికాప్టర్లలోఖమ్మం బయలుదేరిన సీఎంలు, ఇతర అగ్రనేతలు

13:06 January 18

  • యాదాద్రి నుంచి ఖమ్మం సభకు బయలుదేరిన నేతలు
  • రెండు హెలికాప్టర్లలోఖమ్మం బయలుదేరిన సీఎంలు, ఇతర అగ్రనేతలు

11:44 January 18

  • యాదాద్రిలో నలుగురు ముఖ్యమంత్రుల పర్యటన
  • యాదాద్రి ఆలయం దర్శించుకున్న కేసీఆర్‌, కేజ్రీవాల్, భగవంత్‌మాన్‌
  • యాదాద్రి ఆలయం దర్శించుకున్న అఖిలేశ్‌ యాదవ్‌
  • ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అర్చకులు, అధికారులు

11:33 January 18

  • యాదాద్రికి చేరుకున్న నలుగురు ముఖ్యమంత్రులు
  • యాదాద్రి చేరుకున్న కేసీఆర్‌, కేజ్రీవాల్, భగవంత్‌ మాన్‌, విజయన్
  • యాదాద్రి చేరుకున్న అఖిలేశ్‌ యాదవ్‌, సీపీఐ నేత డి.రాజా
  • యాదాద్రి: నేరుగా ప్రెసిడెన్షియల్‌ సూట్లకు చేరుకున్న నేతలు
  • కాసేపట్లో ఆలయానికి వెళ్లనున్న కేసీఆర్‌, కేజ్రీవాల్, భగవంత్‌ మాన్‌
  • ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్న సీఎంలు, ఇతర నేతలు
  • యాదాద్రి నుంచి నేరుగా ఖమ్మం సభకు వెళ్లనున్న నేతలు

11:10 January 18

  • హెలికాప్టర్లలో యాదాద్రికి బయలుదేరిన నలుగురు సీఎంలు
  • యాదాద్రికి బయలుదేరిన కేసీఆర్‌, కేజ్రీవాల్, భగవంత్‌ మాన్‌, విజయన్
  • యాదాద్రికి బయలుదేరిన అఖిలేశ్‌ యాదవ్‌, సీపీఐ నేత డి.రాజా
  • బేగంపేట విమానాశ్రయం నుంచి 2 హెలికాప్టర్లలో యాదాద్రికి పయనం
  • యాదాద్రికి బయలుదేరిన మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, తలసాని
  • యాదాద్రికి బయలుదేరిన ఎంపీ సంతోష్‌, ఎమ్మెల్సీ కవిత

10:56 January 18

  • హెలికాప్టర్లలో యాదాద్రికి బయలుదేరిన సీఎంలు, ఇతర జాతీయ నేతలు
  • యాదాద్రికి బయలుదేరిన కేసీఆర్‌, కేజ్రీవాల్, భగవంత్‌ మాన్‌, డి.రాజా
  • యాదాద్రికి బయలుదేరిన పినరయి విజయన్‌, అఖిలేశ్‌ యాదవ్‌
  • బేగంపేట విమానాశ్రయం నుంచి రెండు హెలికాప్టర్లలో యాదాద్రికి పయనం
  • యాదాద్రి దర్శించుకోనున్న సీఎం కేసీఆర్‌, అరవింద్ కేజ్రీవాల్‌

10:45 January 18

  • ప్రగతిభవన్‌లో ముగిసిన సీఎంలు, ఇతర నేతల అల్పాహార విందు
  • ప్రగతిభవన్‌ నుంచి బయలుదేరిన సీఎం, ఇతర జాతీయ నేతలు
  • కాసేపట్లో బేగంపేట విమానాశ్రయం నుంచి యాదాద్రి పయనం
  • యాదాద్రి దర్శించుకోనున్న సీఎం కేసీఆర్‌, అరవింద్ కేజ్రీవాల్‌
  • యాదాద్రి దర్శించుకోనున్న పినరయి విజయన్‌, భగవంత్‌ మాన్‌
  • యాదాద్రి దర్శించుకోనున్న అఖిలేశ్‌ యాదవ్‌, డి.రాజా

10:25 January 18

ఖమ్మం బహిరంగ సభకు బయలుదేరిన మేడ్చల్‌ జిల్లా ఎమ్మెల్యేలు

  • బీఆర్‌ఎస్‌ సభకు వెళ్తున్న అరికపూడి గాంధీ, మైనంపల్లి హన్మంతరావు
  • బీఆర్‌ఎస్‌ సభకు వెళ్తున్న మాధవరం కృష్ణా రావు, కేపీ వివేకానంద
  • భారీ ఎత్తున కార్యకర్తలతో బయలుదేరిన ఎమ్మెల్యేల వాహన శ్రేణి

10:10 January 18

ప్రగతిభవన్‌లో జాతీయ నేతలకు సీఎం కేసీఆర్‌ అల్పాహార విందు

  • దిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్‌ సీఎం భగవంత్ మాన్‌కు అల్పాహార విందు
  • కేరళ సీఎం పినరయి విజయన్‌కు అల్పాహార విందు
  • యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌, సీపీఐ నేత డి.రాజాకు అల్పాహార విందు
  • జాతీయ రాజకీయాలపై ఇతర రాష్ట్ర నేతలతో సీఎం చర్చలు
  • కేంద్ర ప్రభుత్వ వైఖరిపై జాతీయ నేతలతో సీఎం కేసీఆర్‌ చర్చలు
  • భారాస ఏర్పాటు ఆవశ్యకతను జాతీయ నేతలకు వివరిస్తున్న సీఎం కేసీఆర్‌
  • అల్పాహార విందు అనంతరం యాదాద్రికి వెళ్లనున్న నేతలు

09:53 January 18

  • ప్రగతిభవన్‌లో జాతీయ నేతలకు సీఎం కేసీఆర్‌ అల్పాహార విందు
  • దిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్‌ సీఎం భగవంత్ మాన్‌కు అల్పాహార విందు
  • కేరళ సీఎం పినరయి విజయన్‌కు అల్పాహార విందు
  • యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌, సీపీఐ నేత డి.రాజాకు అల్పాహార విందు
  • అల్పాహార విందు అనంతరం యాదాద్రికి వెళ్లనున్న నేతలు

09:43 January 18

  • యాదాద్రిలో ముఖ్యమంత్రుల పర్యటనకు సర్వం సిద్ధం
  • ఆలయాన్ని పూలు, తోరణాలతో సుందరంగా తీర్చిదిద్దిన అధికారులు
  • సీఎంల కోసం ఆలయంలో ప్రత్యేక ప్రసాదాలు, జ్ఞాపికలు సిద్ధం
  • సీఎంల సందర్శన దృష్ట్యా యాదాద్రిలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు
  • యాదాద్రి: దాదాపు 1600 మంది పోలీసులతో బందోబస్తు
  • ఇప్పటికే పలుమార్లు కొండపైకి కాన్వాయ్‌ల ట్రయల్ రన్ నిర్వహణ

09:31 January 18

  • ప్రగతిభవన్ చేరుకున్న జాతీయ నేతలు

ప్రగతిభవన్ చేరుకున్న సీఎంలు కేజ్రీవాల్, భగవంత్ సింగ్, విజయన్

ప్రగతిభవన్ చేరుకున్న యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌, సీపీఐ నేత డి.రాజా

నేతలకు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అల్పాహార విందు

09:18 January 18

  • ప్రగతిభవన్‌లో కాసేపట్లో అల్పాహార విందు సమావేశం

ఖమ్మం సభకు వచ్చిన విశిష్ట అతిథులకు సీఎం కేసీఆర్‌ అల్పాహార విందు

అల్పాహార విందుకు హాజరుకానున్న కేజ్రీవాల్‌, భగవంత్‌మాన్‌, పినరయి

అల్పాహార విందుకు హాజరుకానున్న అఖిలేశ్‌ యాదవ్‌, డి.రాజా

జాతీయ రాజకీయాలు, సంబంధిత అంశాలపై చర్చించనున్న నేతలు

06:35 January 18

నేడు ఖమ్మంలో భారాస ఆవిర్భావ సభ

  • నేడు ఖమ్మంలో భారాస ఆవిర్భావ సభ
  • ఒకే వేదికపైకి నలుగురు సీఎంలు, జాతీయ నేతలు
  • ఎజెండా ప్రకటించనున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌
  • పాల్గొననున్న దిల్లీ, పంజాబ్‌ సీఎంలు కేజ్రీవాల్, భగవంత్‌ మాన్‌
  • పాల్గొననున్న కేరళ సీఎం పినరయి విజయన్‌
  • పాల్గొననున్న సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా
  • పాల్గొననున్న యూపీ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌
  • భారాస ఆవిర్భావ సభకు ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు
  • 5 లక్షల మందితో బహిరంగ సభ నిర్వహించేలా ఏర్పాట్లు
  • గులాబీ తోరణాలు, భారీ కటౌట్లతో గులాబీమయంగా ఖమ్మం
  • 16 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి భారీగా జన సమీకరణ
  • జాతీయ రాజకీయ సైరన్ మోగించి సత్తా చాటడమే లక్ష్యం
  • నూతన కలెక్టరేట్ వెనుక సభ కోసం 100 ఎకరాలు సిద్ధం
  • 448 ఎకరాల్లో 20 ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్‌ స్థలాలు
  • 5వేల 200 మందితో పోలీసుశాఖ పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు
  • మొత్తం 10 మంది ఐపీఎస్‌ల పర్యవేక్షణతో భారీ బందోబస్తు
Last Updated : Jan 18, 2023, 5:36 PM IST

ABOUT THE AUTHOR

...view details