Khammam BRS public Meeting arrangements: దేశం దృష్టిని ఆకర్షించేలా జరగనున్న ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి పువ్వాడ, ఎంపీ నామ ఇవాళ సభాస్థలిని సందర్శించారు. ఈ నెల 18న ఖమ్మం వేదికగా జరగనున్న భారత్ రాష్ట్ర సమితి సభా ఏర్పాట్లను పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులతో కలిసి వారు పరిశీలించారు. సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కల్పించాలని వసుతలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఖమ్మంలో బీఆర్ఎస్ బహిరంగ సభకు 5 లక్షల మంది జనం - సీఎం కేసీఆర్ వార్తలు
Khammam BRS public Meeting arrangements : ఖమ్మంలో ఈనెల 18న జరగనున్న బీఆర్ఎస్ బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నూతన కలెక్టరేట్ సమీపంలోని 100 ఎకరాల్లో సభ నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. 5 లక్షల మందితో సభను నిర్వహంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు మంత్రి పువ్వాడ, ఎంపీలు నామ సభాస్థలిని పరిశీలించారు.
Preparations for BRS Open Meeting
చరిత్రలో నిలిచిపోయేలా ఈ సభకు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీల నేతలు హాజరుకానున్నట్లు మంత్రి పువ్వాడ తెలిపారు. దేశానికి దిశానిర్దేశం చేసేందుకు అడుగులు వేయనున్న కేసీఆర్‌కు మద్దతు తెలిపేలా పెద్దసంఖ్యలో ప్రజలు సభకు తరలిరావాలని కోరారు. ఈ సభకు దాదాపు 5 లక్షల మంది రానున్నట్లు వెల్లడించారు.
ఇవీ చదవండి: