తెలంగాణ

telangana

ETV Bharat / state

MLA Dance in Women's Day: ఎమ్మెల్యే దానం.. ఓ డీజే టిల్లు - తెరాస ఎమ్మెల్యే స్టెప్పులు

MLA Dance in Women's Day: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే సందడి చేశారు. తన స్టెప్పులతో అందరినీ అలరించారు. హైదరాబాద్​లోని జలగం వెంగళరావు పార్కులో జరిగిన జరిగిన వేడుకల్లో తెరాస ఎమ్మెల్యే వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

MLA Dance in Women's Day:
డీజే పాటలకు ఎమ్మెల్యే దానం స్టెప్పులు

By

Published : Mar 8, 2022, 5:07 PM IST

MLA Dance in Women's Day: మహిళా దినోత్సవ వేడుకల్లో ఖైరతాబాద్ తెరాస ఎమ్మెల్యే దానం నాగేందర్ స్టెప్పులతో అదరగొట్టారు. డీజే పాటలకు మహిళలతో కలిసి నృత్యం చేసి హోరెత్తించారు. ఎమ్మెల్యే దానం స్టెప్పులకు జత కట్టిన మహిళలు ఉత్సాహంగా చిందులు వేశారు. హైదరాబాద్ జలగం వెంగళరావు పార్కులో స్థానిక కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

నిత్యం రాజకీయ కార్యక్రమాల్లో బిజీబిజీగా గడిపే ఎమ్మెల్యే డ్యాన్స్ మొదలెట్టగానే మహిళలు మరింత ఉత్సాహంగా స్టెప్పులు వేశారు. డాన్సులు చేస్తూ మహిళలంతా సంతోషం వ్యక్తం చేశారు. మహిళలతో కలిసి స్టెప్పులు వేయడం ఆనందంగా ఉందని దానం తెలిపారు. అనంతరం కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను లబ్దిదారులకు దానం నాగేందర్ పంపిణీ చేశారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే సందడి

ఇదీ చూడండి:
నగర పోలీస్​ చరిత్రలోనే తొలిసారి.. మహిళా ఎస్​హెచ్​వోగా మధులత బాధ్యతలు

ABOUT THE AUTHOR

...view details