తెలంగాణ

telangana

ETV Bharat / state

దానంకు ఊరట... ఆ తీర్పును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు - ఎమ్మెల్యే దానం నాగేందర్​ వార్తలు

ఖైరతాబాద్ శాసనసభ్యుడు దానం నాగేందర్​కు హైకోర్టులో ఊరట లభించింది. దాడి కేసులో ఇటీవల ప్రజా ప్రతినిధుల కోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేస్తూ ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

danam nagender
దానం నాగేందర్​

By

Published : Jul 28, 2021, 10:04 PM IST

జైలు శిక్ష పడిన ఖైరతాబాద్ శాసనసభ్యుడు దానం నాగేందర్​కు హైకోర్టులో ఊరట లభించింది. దాడి కేసులో ఇటీవల ప్రజా ప్రతినిధుల కోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేస్తూ ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్​ బంజారాహిల్స్​లో 2012లో కారుకు అడ్డు వచ్చిన ఓ వ్యక్తిపై దాడి చేసి బెదిరించారన్న అభియోగంపై దానం నాగేందర్​కు ఈనెల 7న ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు ఆరు నెలల జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధించింది.

దానం నాగేందర్ అదే రోజు జరిమానా చెల్లించడంతో ప్రజాప్రతినిధుల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రజా ప్రతినిధుల కోర్టు తీర్పును సవాల్ చేస్తూ దానం నాగేందర్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణకు స్వీకరించిన హైకోర్టు.. తీర్పును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ.. విచారణను ఆగస్టు 23కి వాయిదా వేసింది.

ఇదీ చదవండి: Srisailam dam: శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తివేత

ABOUT THE AUTHOR

...view details