కొవిడ్ కారణంగా ఉపాధి కోల్పోయిన నిరుద్యోగ యువత కోసం జాబ్ మేళాను నిర్వహిస్తున్న కంపెనీలకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కృతజ్ఞతలు తెలిపారు. ఏయూ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో లక్డికపూల్‌లోని వాసవి కేంద్రంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాను ఆయన ప్రారంభించారు.
'వందలాది కంపెనీలు రాష్ట్రానికి రాబోతున్నాయి' - Khairatabad MLA Danam Nagender
హైదరాబాద్ లక్డికపూల్‌లో ఏర్పాటు చేసిన ఉద్యోగ మేళాకు నిరుద్యోగ యువతి, యువకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని.. ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రారంభించి కంపెనీలకు కృతజ్ఞతలు తెలిపారు.
'వందలాది కంపెనీలు రాష్ట్రానికి రాబోతున్నాయి'
రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు కల్పించే కంపెనీలకు రాష్ట ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే దానం తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లక్షలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని తెలిపారు. తెలంగాణలో నిరుద్యోగ సమస్య లేకుండా చేయడానికి తెరాస ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. రాబోయే రోజుల్లో మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో వందలాది కంపెనీలు రాష్ట్రానికి రాబోతున్నాయన్నారు.
ఇదీ చదవండి:కరోనా పన్ను విధింపుపై నిర్మల స్పష్టత