ఉప్పల్ స్టేడియంలో జరగబోయే ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌ను అడ్డుకుంటామని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్కొన్నారు. ప్రతిభ ఉన్న హైదరాబాద్ క్రికెటర్లకు ఐపీఎల్ వేలంలో అన్యాయం జరిగిందని దానం ఆవేదన వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఫిలింనగర్‌లో తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న దానం.. ఈ వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ క్రికెటర్లకు ఐపీఎల్ వేలంలో అన్యాయం: ఎమ్మెల్యే దానం - ఖైరతాబాద్ ఎమ్మెల్యే వార్తలు
ఐపీల్ క్రికెట్ వేలంలో హైదరాబాద్ క్రీడాకారులకు అన్యాయం జరిగిందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉప్పల్ స్టేడియంలో జరగబోయే ఐపీఎల్ మ్యాచ్‌ను అడ్డుకుంటామని స్పష్టం చేశారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్
వేలంలో హైదరాబాద్ క్రీడాకారులను గుర్తించకపోవడం దారుణమని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిలింనగర్ అభివృద్ధికి అండగా నిలుస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:రుణ యాప్‌ల వ్యవహరంలో కేసు నమోదు చేసిన ఈడీ