తెలంగాణ

telangana

ETV Bharat / state

ధన్వంతరి నారాయణుడిగా ఖైరతాబాద్‌ గణపయ్య - ధన్వంతరి నారాయణుడిగా ఖైరతాబాద్‌ గణపయ్య

హైదరాబాద్‌లో ధన్వంతరి నారాయణుడిగా ఖైరతాబాద్‌ వినాయకుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. కొవిడ్‌ మహమ్మారికి ఔషధం తెచ్చే ధన్వంతరి నారాయణ గణపతిగా స్వామి అభయమిస్తున్నాడు. చేతిలో వనమూలికలు, వైద్య పుస్తకంతో ఉన్న వినాయకుడికి కుడివైపున మహాలక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతి కొలువుదీరారు.

ధన్వంతరి నారాయణుడిగా ఖైరతాబాద్‌ గణపయ్య
ధన్వంతరి నారాయణుడిగా ఖైరతాబాద్‌ గణపయ్య

By

Published : Aug 22, 2020, 11:28 AM IST

Updated : Aug 22, 2020, 11:33 AM IST

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌ ఖైరతాబాద్‌లోని గణపయ్య ధన్వంతరి నారాయణుడిగా భక్తులకు దర్శనిమస్తున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ దఫా విగ్రహం నిర్మాణాన్ని 9 అడుగులకే పరిమితం చేశారు.

ధన్వంతరి నారాయణుడిగా ఖైరతాబాద్‌ గణపయ్య

కొవిడ్‌ మహమ్మారికి ఔషధం తెచ్చే ధన్వంతరి నారాయణ గణపతిగా స్వామి దర్శనమిస్తున్నారు. చేతిలో వనమూలికలు, వైద్య పుస్తకంతో ఉన్న వినాయకుడికి కుడివైపున మహాలక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతి కొలువుదీరారు.

కరోనా దృష్ట్యా భక్తులకు నేరుగా అనుమతి లేదని.. www.ganapathideva.org వెబ్‌సైట్‌ ద్వారా పూజా కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు.

ఇవీ చూడండి:డీలాపడ్డ పూల మార్కెట్​.. ఆవేదన చెందుతున్న రైతులు

Last Updated : Aug 22, 2020, 11:33 AM IST

ABOUT THE AUTHOR

...view details