కరోనా ప్రభావం ఈసారి గణేశుని నిమజ్జనంపై స్పష్టంగా కనిపించింది. ప్రతి ఏటా భారీ విగ్రహాలతో లక్షల్లో భక్తులతో కిటకిటలాడే ప్రధాన రహదారుల బోసి పోయాయి. తమ ఇంట్లో కొలువుదీరిన చిన్న చిన్న గణనాథులను తీసుకుని ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లలో మాత్రమే భక్తులు నిమజ్జనం చేసేందుకు వచ్చారు.
ఈ సారి 9 అడుగులకే పరిమితమైన ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర కూడా నిడారంబరంగానే సాగింది. ప్రతి ఏటా భారీ కాయంతో, విభిన్న రూపాలతో అలరించే గణనాథుడు ఈ సారి కరోనాని పారద్రోలే ధన్వంతరి నారాయణ అవతారంతో ధర్శనం ఇచ్చాడు. ప్రతిష్ఠించిన చోటే నిమజ్జనం చేసేందుకు ఖైరతాబాద్ ఉత్సవ కమిటి సభ్యులు యోచించిన... పోలీసుల అనుమతి లభించకపోవడం వల్ల యథావిధిగా హుస్సేన్ సాగర్లో నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు.