Khairatabad Ganesh Height 2023 :వినాయక చవితి వస్తుందంటే చాలు.. రాష్ట్ర ప్రజలందరి దృష్టి ఖైరతాబాద్ గణేషుడిపైనే ఉంటుంది. ఈసారి ఎన్ని అడుగుల్లో దర్శనమివ్వనున్నారు.. ఏ అవతారంలో కనువిందు చేయనున్నారనే దానిపైనే అందరి ఫోకస్ ఉంటుంది. భక్తులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహం నమూనా (Khairtabad Ganesh poster 2023) వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఖైరతాబాద్ మహా గణపతి విగ్రహం.. ఈ ఏడాది 63 అడుగుల్లో శ్రీ దశమహా విద్యాగణపతిగా రూపుదిద్దుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Ganesh Chaturthi Hyderabad 2023 : పర్యావరణ హితం కోసం మట్టి గణపతినే ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఖైరతాబాద్‌లో గణేశుని ఉత్సవాలుప్రారంభమై ఈ ఏడాదితో 69 ఏళ్లు అవుతోంది. ఏటా సిద్ధాంతి విఠలశర్మ సూచనతో నమూనా సిద్ధం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఆ ప్రకారమే ప్రస్తుత పరిస్థితులను అనుగుణంగా ఆయన సూచనల ప్రకారం నామకరణం చేశారు.
కోలాహలంగా ఖైరతాబాద్.. లంబోదరుడి దర్శనానికై జనసందోహం
63 Feet Khairatabad Ganesh Idol 2023 :విగ్రహం ఎత్తు 63 అడుగులు, వెడల్పు 28 అడుగులుగా ఉండనుంది. నిల్చున్న తీరులో 'శ్రీ దశమహా విద్యాగణపతి' విగ్రహం ఉండగా.. తలపై ఏడు సర్పాలు ఉండనున్నాయి. వెనక సంస్కృతంలో రాసిన గ్రంథం కనిపిస్తుంది. పది చేతులు ఉంటాయి. కుడి వైపు చేతుల్లో కింద నుంచి పైకి ఆశీర్వాదం, దండ, వరి ధాన్యం, తల్వార్, బాణం ఉంచుతారు. ఎడమవైపు కింద నుంచి పైకి చేతిలో లడ్డూ, గ్రంథం, తాడు, అంకుశం, బాణం ఉంటాయి. కాళ్ల వద్ద అటూ ఇటూ పది అడుగుల ఎత్తున వరాహదేవి, సరస్వతీ దేవి విగ్రహాలు ఉంటాయి.