తెలంగాణ

telangana

ETV Bharat / state

KGF Hero Visit Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న 'కేజీఎఫ్' హీరో - తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేజీఎఫ్ "హీరో"

KGF Hero: కేజీఎఫ్-2 చిత్రం ప్రమోషన్‌లో భాగంగా తిరుపతికి వచ్చిన హీరో యశ్​.. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు.

kGF Hero Yash visit Tiruapthi
kGF Hero Yash visit Tiruapthi

By

Published : Apr 11, 2022, 1:25 PM IST

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న 'కేజీఎఫ్' హీరో

KGF Hero: తిరుమల శ్రీవారిని కేజీఎఫ్ చిత్ర కథానాయకుడు యశ్​ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. కేజీఎఫ్-2 చిత్రం ప్రమోషన్‌లో భాగంగా తిరుపతికి వచ్చిన యశ్​ స్వామివారి ఆశీస్సులను తీసుకున్నారు.

యశ్​ నటించిన కేజీయఫ్‌ ఛాప్టర్‌ 2 ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనిపై సినీ అభిమానులు భారీగా అంచనాలు పెంచుకున్నారు. ఇప్పటికే ధియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్‌లు ప్రారంభమైయాయి.

ABOUT THE AUTHOR

...view details