తెలంగాణ

telangana

ETV Bharat / state

నారా లోకేశ్​తో.. కేజీఎఫ్​ హీరో యశ్ భేటీ - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

KGF Hero Yash met Nara Lokesh: ప్రముఖ సినీ నటుడు, కేజీఎఫ్ ఫేమ్‌ యశ్.. హైదరాబాద్‌లో తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను కలిశారు. దాదాపు అరగంట పాటు ఈ సమావేశం సాగింది. భేటీలో ఏ అంశాలు చర్చకొచ్చాయో ఇప్పటివరకు తెలియకపోయినా, వీరిద్దరూ కలవడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.

KGF Hero Yash met Nara Lokesh
KGF Hero Yash met Nara Lokesh

By

Published : Dec 15, 2022, 11:00 PM IST

KGF Hero Yash met Nara Lokesh: అతను ప్రముఖ హీరో.. ఆయనేమో తీరికలేని రాజకీయ నాయకుడు. వారిద్దరి కలయిక సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. అసలు వారి భేటీకి కారణాలు తెలుసుకునేందుకు అటూ రాజకీయ.. సినీ వర్గాలు ఆత్రుతగా ఎదురు చూస్తున్నాయి. ప్రముఖ సినీ నటుడు, కేజీఎఫ్ ఫేమ్‌ యశ్.. హైదరాబాద్‌లో తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను కలిశారు. దాదాపు అరగంట పాటు ఈ సమావేశం సాగింది. భేటీలో ఏ అంశాలు చర్చకొచ్చాయో ఇప్పటివరకు తెలియకపోయినా, వీరిద్దరూ కలవడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. అయితే వీరి భేటిలో వివిధ అంశాలపై చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

నారా లోకేశ్​తో.. కేజీఎఫ్​ హీరో యశ్ భేటీ

ABOUT THE AUTHOR

...view details