తెలంగాణ

telangana

ETV Bharat / state

పరిశ్రమల శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం ఛైర్మన్​గా కేకే - K KESHAVA RAO

పరిశ్రమల శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం ఛైర్మన్​గా తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు నియమితులయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే అసెంబ్లీకి వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్​కు తెలిపారు.

పరిశ్రమల శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం ఛైర్మన్​గా కేకే

By

Published : Sep 14, 2019, 6:46 PM IST

పరిశ్రమల శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం ఛైర్మన్​గా తెరాస పార్లమెంటరీ పార్టీ నేత డాక్టర్ కె.కేశవ రావు నియమితులయ్యారు. ఈ మేరకు లోక్​సభ సెక్రటరీ జనరల్... ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ కమిటీలో 21 మంది లోక్​సభ సభ్యులు, పది మంది రాజ్యసభ సభ్యులు ఉంటారని ప్రకటనలో వెల్లడించారు. ప్రతిష్ఠాత్మక కమిటీకి తనను ఛైర్మన్​గా ఎంపిక చేయడం పట్ల కేశవ రావు హర్షం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఆవరణలోని సీఎం ఛాంబర్​కి వెళ్లి కేసీఆర్​ని కలిసి ఛైర్మన్​గా ఎంపిక చేసిన విషయాన్ని తెలిపారు. ముఖ్యమంత్రి ... కేశవ రావుకు శాలువా కప్పి అభినందనలు తెలియజేశారు.

పరిశ్రమల శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం ఛైర్మన్​గా కేకే

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details