ఇంకా పెరగనున్న కిరోసిన్ ధరలు
పెరగనున్న కిరోసిన్ ధరలు - litre
కిరోసిన్ వినియోగదారులపై తాజాగా 25పైసలు పెంచుతూ పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ధరలు అర్ధరాత్రి అమల్లోకి వచ్చాయి. రాబోయే నెలల్లో ఈ ధరలు ఇంకా పెరగనున్నట్లు సమాచారం.
చౌక ధరల దుకాణాల డీలర్లు, టోకు వర్తకుల కమీషన్ పెంచుతూ తాజాగా పౌరసరఫరాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కిరోసిన్ వినియోగం పెరుగుతున్న దృష్ట్యా లీటరు ధర 29.75 రూపాయలు, రిటైలర్కైతే 25 పైసల కమీషన్‌తో మొత్తం కలిపి 30 రూపాయలు చొప్పున ధర ఉండనుంది. మే నుంచి జూన్ వరకు లీటరు ధర 31 రూపాయలుగా ఉండనున్నాయి. ఇక జూలై నుంచి ఆగస్టు వరకు 32 రూపాయలు, సెప్టెంబరు నుంచి అక్టోబరు వరకు 33, నవంబరు, డిసెంబరులలో 34 రూపాయల చొప్పున ధరలు పెరగనున్నాయి. కమీషన్ ధరల్లో ఎలాంటి మార్పు ఉండబోవడం లేదు. 2014లో లీటరు కిరోసిన్ ధర 18 రూపాయలు ఉండేది. ఏటేటా చమురు ధరలు పెరగడం సర్వ సాధారణమేనని పౌర సరఫరాల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇవీ చూడండి: తలసానిని కలిసిన మా సభ్యులు