కేరళ శాసనసభాపతి శ్రీరామకృష్ణన్ తెలంగాణ శాసనసభను సందర్శించారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ఆయన ఈ ఉదయం అసెంబ్లీకి విచ్చేశారు. సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి స్వాగతం పలికారు. శాసనసభ సమావేశాల నిర్వహణ, ఇతర అంశాలపై ఇరువురు స్పీకర్లు చర్చించారు. కేరళ సభాపతిని పోచారం సత్కరించారు.
తెలంగాణ శాసనసభను సందర్శించిన కేరళ సభాపతి