తెలంగాణ

telangana

ETV Bharat / state

కొవిడ్ వేళలో శబరిమల యాత్రకు ఈ నిబంధనలు తప్పనిసరి! - శబరిమల యాత్ర నిబంధనలు

శబరిమల యాత్ర కోసం రానున్న భక్తులకు కొవిడ్​ దృష్ట్యా ప్రత్యేక నిబంధనలు రూపొందించినట్లు రాష్ట్ర ప్రభుత్వ సీఎస్​ సోమేష్​కుమార్​కు కేరళ సీఎస్ లేఖ రాశారు.

kerala cs letter to telangana cs about visiting sabarimala  temple
కొవిడ్ వేళలో శబరిమల యాత్రకు ఈ నిబంధనలు తప్పనిసరి!

By

Published : Oct 15, 2020, 5:22 PM IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో శబరిమల యాత్ర కోసం కేరళ ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలు రూపొందించింది. భక్తుల ఆరోగ్యం, ఇతర అంశాలను దృష్ట్యా ఆలయ విధివిధానాలను రూపొందించారు. తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు శబరిమల తరలివెళ్లనున్నందున రాష్ట్ర ప్రభుత్వ సీఎస్​ సోమేష్​కుమార్​కు కేరళ సీఎస్ లేఖ రాశారు.

లేఖలో పేర్కొన్న ముఖ్యాంశాలు:

  • దర్శనం కోసం వర్చువల్​ క్యూపోర్టల్​ https://sabarimalaonline.org ద్వారా భక్తుల నమోదు తప్పనిసరి చేశారు.
  • మొదటగా రోజుకు వెయ్యి, వారాంతంలో రోజుకు రెండు వేల మంది భక్తులను మాత్రమే ఆలయం లోనికి అనుమతించనున్నారు.
  • శబరిమల ప్రవేశమార్గాల వద్ద యాంటీజెన్​ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. దర్శనానికి 48 గంటల ముందు కొవిడ్​ నెగిటివ్​ నిర్ధరణ కలిగి ఉండాలి.
  • పదేళ్లలోపు, 60 ఏళ్లకు పైబడిన వారికి దర్శనానికి అనుమతి లేదు.
  • బీపీఎల్​, ఆయుష్మాన్​ భారత్​ కార్డులు ఉన్న వారు వెంట తీసుకెళ్లడం శ్రేయస్కరం.
  • నెయ్యి అభిషేకం, పంపా నదిలో స్నానాలు, సన్నిధానం, పంపా, గణపతి కోవెలలో రాత్రి బసకు అనుమతి లేదు.
  • ఎరుమేలి, వడసెర్రికర మార్గాల్లోనే శబరిమలకు వెళ్లేందుకు భక్తులకు అనుమతి ఉంటుందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details