Kerala cm meet KCR: వామపక్ష కీలక నేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్ వేర్వేరుగా భేటీ అయ్యారు. సీపీఎం, సీపీఐ జాతీయ నేతలతో ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో జరుగుతున్న సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలకు హాజరయ్యేందుకు కేరళ సీఎం పినరయి విజయన్, త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తదితరులు... ఏవైఎస్ఎఫ్ జాతీయ మహాసభల కోసం సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, కేరళ మంత్రి రాజన్, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తదితరులు హైదరాబాద్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో సీపీఎం, సీపీఐ జాతీయ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ విధానాలు, జాతీయ రాజకీయాలపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల అమ్మకం, రైతు విధానాలు, రాష్ట్రాల పట్ల అనుసరిస్తున్న వైఖరిపై చర్చించారు.
ప్రగతిశీల శక్తులు కలిసి పోరాడాలని..
కేంద్రంలో భాజపా పాలన నుంచి విముక్తి కోసం ప్రగతిశీల శక్తులు కలిసి పోరాడాలని తెరాస, ఉభయ కమ్యూనిస్టు పార్టీల నేతలు అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. భాజపా ముక్త్ భారత్ కోసం ప్రగతిశీల శక్తులు ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని సీపీఐ, సీపీఎం నేతల జాతీయ నేతలు పేర్కొన్నారు. భవిష్యత్తు కార్యాచరణ కోసం భావ సారూప్య పార్టీలు మరోసారి సమావేశం కావాలని చర్చల్లో నిర్ణయించినట్లు సమాచారం. భాజపా విభజన రాజకీయాలు దేశ ఐక్యతకే భంగం కలిగించే ప్రమాదం వుందని వామపక్ష పార్టీల నేతలు పేర్కొన్నారు. భారతీయ గంగా జమునా తహజీబ్‌ను కాపాడాల్సిన బాధ్యత రాజకీయ పక్షాలపై ఉందని వామపక్ష నేతలు అభిప్రాయపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, రైతుకూలీలకు వ్యతిరేక ధోరణితో భాజపా పాలన కొనసాగుతోందని వామపక్ష పార్టీలు పేర్కొన్నాయి.
ప్రధాని పర్యటనకు ఆటంకంపై చర్చ