నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం నుంచి తప్పించి, ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని తెరాస కోరింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథిని కలిసిన తెరాస ప్రతినిధుల బృందం... ఈ మేరకు అర్వింద్‌పై ఫిర్యాదు చేసింది.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హింసను ప్రేరేపించాలని భాజపా చూస్తోందన్న నేతలు... నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.