కార్తీక మాసం సందర్భంగా ప్రతి సంవత్సరం సత్యనారాయణ స్వామి వ్రతం, గౌరీ పూజలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించడం తమ కుటుంబ ఆనవాయితీ అని హనుమంత రావు తెలిపారు. అయితే ఈసారి రాష్ట్రమంతా దీపావళి సంబురాలు చేసుకుంటే ఒక్క ఆర్టీసీ కార్మికుడి ఇంట్లో దీపం కూడా వెలగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి తండ్రిలాంటి వాడని.. అలాంటి వ్యక్తి పంతంతో 15 మంది కార్మికులు అమరులయ్యారని వాపోయారు. ఆర్టీసీని ప్రైవేటీకరించే నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోని కార్మికులకు న్యాయం చేయాలని భగవంతున్ని కోరుకుంటున్నట్లుగా హనుమంతరావు పేర్కొన్నారు.
కేదారనాథ్ వ్రతం చేసినా మనసులో బాధ ఉంది: వీహెచ్
కేదారనాథ్ వ్రతం చేసిన మనసులో బాధ ఉందని హనుమంత రావు అన్నారు. రాష్ట్రమంతా దీపావళి వేడుకలు చేసుకుంటే ఒక్క ఆర్టీసీ కార్మికుడి ఇంట్లో దీపం వెలగలేదని ఆవేదన చెందారు. ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం న్యాయం చేయాలని భగవంతున్న ప్రార్థించనట్లు ఆయన తెలిపారు.
కేదారనాథ్ వ్రతం చేసినా మనసులో బాధ ఉంది: వీహెచ్