తెలంగాణ

telangana

ETV Bharat / state

కర్నల్‌ సంతోష్‌బాబు కుటుంబానికి రూ.5 కోట్లు ప్రకటించిన సీఎం - telangana updates

కర్నల్‌ సంతోష్‌బాబు కుటుంబానికి రూ.5 కోట్లు ప్రకటించిన సీఎం
కర్నల్‌ సంతోష్‌బాబు కుటుంబానికి రూ.5 కోట్లు ప్రకటించిన సీఎం

By

Published : Jun 19, 2020, 7:10 PM IST

Updated : Jun 19, 2020, 8:07 PM IST

18:02 June 19

కర్నల్‌ సంతోష్‌బాబు కుటుంబానికి రూ.5 కోట్లు ప్రకటించిన సీఎం

గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో మరణించిన కర్నల్ సంతోష్ బాబు కుటుంబానికి రాష్ట్రప్రభుత్వం పూర్తిఅండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్​రావు ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం తరఫున సహాయం ప్రకటించారు. సంతోష్​బాబు కుటుంబానికి రూ.5 కోట్ల నగదు, నివాస స్థలం, ఆయన భార్య సంతోషికి  గ్రూప్​-1 స్థాయి ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

               తానే స్వయంగా సంతోష్ బాబు ఇంటికి వెళ్లి సాయం అందించనున్నట్లు వెల్లడించారు. ఇదే ఘర్షణలో మరణించిన మిగతా 19 మంది కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి.. రూ.10 లక్షల చొప్పున కేంద్ర రక్షణ మంత్రి ద్వారా అందిస్తామని సీఎం కేసీఆర్​ వెల్లడించారు.  

          సరిహద్దుల్లో దేశ రక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సైనికులకు యావత్ దేశం అండగా నిలవాలి. వీర మరణం పొందిన సైనికుల కుటుంబాలను ఆదుకోవాలి. తద్వారా సైనికుల్లో ఆత్మ విశ్వాసం.. వారి కుటుంబాల్లో భరోసా నింపాలి. దేశమంతా మీ వెంటనే ఉందనే సందేశం అందించాలి. వీర మరణం పొందిన సైనికులకు కేంద్ర ప్రభుత్వం ఎలాగూ సాయం చేస్తుంది. కానీ రాష్ట్రాలు కూడా సహాయ సహకారాలు అందించాలి. అప్పుడే సైనికులకు, వారి కుటుంబాలకు దేశం మా వెంట నిలుస్తుందనే నమ్మకం కుదురుతుంది. సింబల్ ఆఫ్ యూనిటీ ప్రదర్శించాలి. కరోనాతో ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ మిగతా ఖర్చులు తగ్గించుకుని అయినా సైనికుల సంక్షేమానికి పాటుపడాలి...

                          - ప్రధాని నిర్వహించిన అఖిలపక్ష భేటీలో కేసీఆర్​  

Last Updated : Jun 19, 2020, 8:07 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details