బతుకమ్మ పండగ సందర్భంగా దేవాలయాలు, చెరువుల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమైన బతుకమ్మ పండుగను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. సహజసిద్ధంగా పెరిగే పూలను ఆరాధించే గొప్ప వేడుకగా నిలిచే బతుకమ్మ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని సీఎం అన్నారు.
'బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక' - KCR TWEET ABOUT BATHUKAMMA FESTIVAL
బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పండుగను అందరు ఘనంగా జరుపుకోవాలని సూచించారు.

'బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక'