దేశాన్ని సాకే రాష్ట్రాల్లో తెలంగాణ ముందుంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో పేర్కొన్నారు. 2014-19 వరకు కేంద్రానికి పన్నుల రూపంలో భారీగా చెల్లించామని చెప్పారు. గత ఐదేళ్లలో 2.70 లక్షల కోట్లు చెల్లించినట్లు తెలిపారు. అదే సమయంలో కేంద్రం నుంచి 1.12 లక్షల కోట్లు మాత్రమే వచ్చాయని వెల్లడించారు. జాతి నిర్మాణంలో తెలంగాణ కీలకపాత్ర పోషిస్తోందని వివరించారు.
దేశాన్ని సాకే రాష్ట్రాల్లో తెలంగాణ ముందుంటుంది: కేసీఆర్ - శాసనసభ సమావేశాల్లో కేసీఆర్
కేంద్రానికి మన రాష్ట్రం భారీగా పన్నుల రూపంలో చెల్లిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో పేర్కొన్నారు. దేశాన్ని సాకే రాష్ట్రాల్లో తెలంగాణ ముందుంటుందని తెలిపారు.
దేశాన్ని సాకే రాష్ట్రల్లో తెలంగాణ ముందు: కేసీఆర్
ప్రపంచదేశాల్లో అగ్రరాజ్యంగా అమెరికా వెలుగొందుతోందని... అత్యధిక అప్పులు ఉన్న దేశాల్లోనూ అమెరికా ముందుంటుందని చెప్పారు. ఏపీ బడ్జెట్‌తో సమానంగా ఈ ఆర్థిక సంవత్సరం ఖర్చు పెట్టినట్లు అసెంబ్లీలో వ్యాఖ్యానించారు.
ఇదీ చూడండి :సీఏఏ వ్యతిరేక తీర్మానానికి శాసనసభ ఆమోదం
Last Updated : Mar 16, 2020, 6:17 PM IST