తెలంగాణ

telangana

ETV Bharat / state

'దళితబంధు పథకానికి ప్రేరణ.. అంబేడ్కర్​ మహాశయుడే' - తెలంగాణలో బీఆర్​ అంబేడ్కర్​ వర్దంతి

CM KCR about BR Ambedkar : డా. బీఆర్​ అంబేడ్కర్​ వర్ధంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను సీఎం కేసీఆర్​ స్మరించుకున్నారు. సమాజంలో అసమానతలు రూపుమాపడంలో అంబేడ్కర్​ మహనీయుడి కృషే ఫలితాన్ని ఇచ్చిందని సీఎం కేసీఆర్​ అన్నారు. ప్రతి మనిషి ఆత్మగౌరవంతో జీవించాలని అంబేడ్కర్​ ఆకాంక్షించారన్నారు.

cm kcr
సీఎం కేసీఆర్​

By

Published : Dec 6, 2022, 8:03 AM IST

Updated : Dec 6, 2022, 10:01 AM IST

CM KCR about BR Ambedkar : సామాజిక అసమానతలను రూపుమాపేందుకు డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్​ జీవితమంతా పోరాడారని సీఎం కేసీఆర్ అన్నారు. అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలన్న దార్శనికతతోనే రాజ్యాంగాన్ని రూపొందించారని కొనియాడారు. ఇవాళ అంబేడ్కర్​ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను కేసీఆర్​ గుర్తు చేసుకున్నారు. ప్రతి మనిషి ఆత్మగౌరవంతో జీవించాలని బీఆర్ అంబేడ్కర్​ ఆకాక్షించారని సీఎం అన్నారు. అదే స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్లు చెప్పారు.

దళితబంధు పథకానికి ప్రేరణ, స్ఫూర్తి అంబేడ్కర్​ మహాశయుడేనని స్పష్టం చేశారు. కొత్త సచివాలయానికి అంబేడ్కర్​ పేరు పెట్టామన్నారు. దేశంలోనే అతిపెద్దదైన 125 అడుగుల విగ్రహాన్ని హైదరాబాద్​లో ప్రతిష్ఠించనున్నట్లు తెలిపారు. అంబేద్కర్ తాను అనుభవించిన సామాజిక వివక్షను సవాల్ గా తీసుకుని విజయం సాధించి విశ్వమానవ సౌభ్రాతృత్వానికి దిక్సూచిగా నిలిచి ప్రపంచ మేధావిగా ఎదిగారని గుర్తు చేశారు.

రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ ఏర్పాటుకు కారణమైన అంబేడ్కర్ గొప్పతనాన్ని విశ్వానికి చాటే దిశగా తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని కేసీఆర్ తెలిపారు. అంబేడ్కర్ ఆశయాలు, విలువలను అనుసరిస్తూ, దళిత బహుజన పేద వర్గాల అభ్యున్నతికి పాటుపడటమే ఆ మహానుభావునికి ఇచ్చే అసలైన నివాళి అని.. అదే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగిస్తున్నదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 6, 2022, 10:01 AM IST

ABOUT THE AUTHOR

...view details