ఎన్నికల సంఘం రాజ్యాంగ పరిధి దాటి ప్రవర్తిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. సాగర్ సభ పెట్టవద్దని హైకోర్టులో కేసులు వేశారని గుర్తుచేశారు. హుజూరాబాద్‌లో సభ నిర్వహించవద్దంటూ ప్రయత్నాలు చేస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు.
ఎన్నికల సంఘం రాజ్యాంగ పరిధి దాటి ప్రవర్తిస్తోంది. ఈసీ చిల్లరమల్లర పనులు మానుకోవాలిని హెచ్చరిస్తున్నా. ఒక సీఎంగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా నేను చెబుతున్నా. ఎన్నికల సంఘం గౌరవప్రదంగా వ్యవహరించాలి. నవంబరు 4వ తేదీ వరకే ఈసీ దళితబంధు అమలును ఆపగలదు. హుజూరాబాద్‌లో గెల్లు శ్రీనివాస్ గెలిచి తీరుతడు. నవంబరు, డిసెంబర్‌లో దళితబంధు యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తాం.