తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ - TRS

రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు, కేంద్ర ప్రభుత్వానికి కూడా రైతుబంధు ఆదర్శమైంది. ఐక్యరాజ్య సమితి రైతుబంధు పథకాన్ని ప్రపంచంలోని గొప్ప పథకాల్లో ఒకటిగా పేర్కొని, ప్రశంసించింది: కేసీఆర్, ముఖ్యమంత్రి

రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ

By

Published : Jun 2, 2019, 12:14 PM IST

రైతాంగ సమస్యలు పరిష్కరించే దిశగా... ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ అధికారంలోకి వచ్చిన మొదటి దశలోనే రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేశామని ఊరటనివ్వగలిగామని చెప్పారు. ఇప్పుడు మరో సారి లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయబోతున్నామన్నారు. ఎరువులు, విత్తనాల కోసం గతంలో మాదిరిగా రైతులు అగచాట్ల పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని సకాలంలో అందించ గలుగుతున్నామని కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతుబంధు పథకం రైతుల హృదయాల్లో సంతోషం నింపిందని చెప్పారు. రైతుబంధు పథకం ద్వారా అందించే మొత్తాన్ని ఎకరానికి 8 వేల నుంచి 10 వేలకు పెంచి, ఈ సంవత్సరం నుంచే అందిస్తున్నామని చెప్పారు.

రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ

ABOUT THE AUTHOR

...view details