రెవెన్యూ డిపార్టుమెంటుపై కేసీఆర్ సీరియస్ అయ్యారు. రెవెన్యూల్లో గందరగోళాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ప్రజలు ఎందుకు పెట్రోలు డబ్బా పట్టుకుని వస్తున్నారు.... అంత చెడ్డ పేరు ఎందుకు తెచ్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులు కూడా కొంత ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. రెవెన్యూ అధికారులతో మాట్లాడి పటిష్ఠమైన రెవెన్యూ చట్టం తీసుకువస్తామని తెలిపారు.
'అధికారులు సక్కగుంటే.. పెట్రోల్ తీసుకుని ఎందుకొస్తరు' - KCR LATEST NEWS
రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం త్వరలో తీసుకువస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రెవెన్యూ డిపార్టమెంట్పై మండిపడ్డ కేసీఆర్... అధికారులు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.
రెవెన్యూ డిపార్ట్మెంట్పై కేసీఆర్ సీరియస్