500 చదరపు మీటర్ల వరకు చేపట్టే నిర్మాణాల అనుమతికి ఏ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో స్పష్టం చేశారు. నిర్మాణానికి సంబంధించిన వివరాలు అన్ని సరిగా ఉంటే ఆన్‌లైన్‌లోనే అనుమతి వస్తుందని తెలిపారు. ఇక నుంచి ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండొద్దని సీఎం ఆకాంక్షించారు. యజమానులే ఇంటి నిర్మాణానికి సంబంధించిన స్వీయ ధ్రువీకరణ ఇవ్వాలని చెప్పారు.
'ఇక నోటీసులు లేవు... కూలగొట్టుడే' - అక్రమ నిర్మాణాలకు ఇక నోటీసులు ఉండవు
మాది 'సిటిజన్ ఫ్రెండ్లీ అర్బన్' పాలసీ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. ఇక నుంచి అక్రమ నిర్మాణాలు చేపడితే నోటీసు ఇవ్వకుండానే కూల్చివేస్తామని స్పష్టం చేశారు.
కలెక్టర్ ఆధ్వర్యంలోని ఫ్లైయింగ్‌స్వ్కా డ్ బృందం ఇళ్లకు సంబంధించిన కొలతలు చేపడుతుందన్నారు. ఒకవేళ ఇంటి కొలతలు, ఇతర తప్పుడు సమాచారం ఇస్తే భారీగా జరిమానాలు కట్టాల్సిందేనని వెల్లడించారు. అక్రమ నిర్మాణాలు చేపడితే నోటీసు ఇవ్వకుండానే కూల్చివేస్తామన్నారు... ఈ విషయంలో ఎవర్ని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ వంటి కేసుల్లో హైకోర్టులో తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆగస్టు 15 నుంచి రియల్ టైమ్ పరిపాలన సంస్కరణలు అమలులోకి వస్తాయని సీఎం కేసీఆర్ తెలిపారు.
ఇవీ చూడండి:పచ్చదనం లేకుంటే పదవుల నుంచి తొలగింపు