తెలంగాణ

telangana

ETV Bharat / state

75 గజాలలోపు ఇంటి నిర్మాణానికి అనుమతి అవసరం లేదు - 2019

రెండో రోజు అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది. నూతన పురపాలక ముసాయిదా బిల్లులో పేదలకు మరిన్ని పౌర సదుపాయాలు కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు తెలియాజేశారు.

assembly

By

Published : Jul 19, 2019, 11:43 AM IST

గ్రామస్వరాజ్యం కోసం మహాత్మాగాంధీ ఎంతగానో తపన పడ్డారని ముఖ్యమంత్రి కేసీఆర్​ అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. పంచాయతీ వ్యవస్థ అనేది ఒక విభాగం కాదు.. ఉద్యమమని సీఎం స్పష్టంచేశారు. అవినీతిరహిత పాలన కోసం నూతన పురపాలక చట్టం తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ చట్టంలో
పేదల కోసం మరిన్ని పౌర సదుపాయాలు కల్పించామన్నారు. పట్టణాల్లో పేదలు 75 గజాల లోపు జీప్లస్​ 1 ఇంటి నిర్మాణానికి అనుమతి అవసరంలేదని తీపి కబురు చెప్పారు. అలాగే జీ ప్లస్‌ 1 వరకు రిజిస్ట్రేషన్​ ఫీజు ఒక్క రూపాయిగా నిర్ణయించినట్లు తెలిపారు. 75 గజాలలోపు నిర్మించుకున్న ఇంటికి పన్ను ఏడాదికి రూ.100 మాత్రమే అని సీఎం పేర్కొన్నారు.

75 గజాలలోపు ఇంటి నిర్మాణానికి అనుమతి అవసరంలేదు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details