రాష్ట్రంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. అభివృద్ధి క్రమపద్ధతిలో జరగాలనే ఉద్దేశంతోనే కొత్త మున్సిపాలిటీ చట్టం తీసుకువస్తున్నామని అసెంబ్లీలో సీఎం స్పష్టం చేశారు. కొత్త జిల్లాలు, మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలను ఏర్పాటు చేస్తూ అత్యంత సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో నూతనంగా 5వేల పరిపాలన విభాగాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న 136 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు తోడుగా మరో 7 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నామని సభలో ముఖ్యమంత్రి వెల్లడించారు. కొత్త గ్రామపంచాయతీ కానీ మున్సిపల్ వార్డు కానీ ఏర్పాటు చేయాలంటే శాసనసభ ఆమోదించాల్సిందేనన్నారు.
'తెలంగాణలో మరో 7 కార్పొరేషన్ల ఏర్పాటు' - Municipal act 2019
రాష్ట్రంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా మరో 7నూతన కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తెలిపారు. రేపు మున్సిపల్ చట్టానికి సంబంధించిన పూర్తి వివరాలను సభ్యులకు వివరిస్తానాని సీఎం చెప్పారు.
assembly