తెరాస సభ్యత్వ నమోదు జోరుగా సాగాలని, ఈ నెల 20న తుది గడువు వరకు పెద్దఎత్తున పార్టీలో ప్రజలను చేర్పించాలని... పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ నాయకులకు సూచించారు. ప్రతి నియోజకవర్గంలోనూ లక్ష్యాలను సాధించాలని నిర్దేశించారు. గత నెల 27 నుంచి పార్టీ సభ్యత్వ నమోదు సాగుతోంది. సభ్యత్వ నమోదు తీరును సీఎం కేసీఆర్ గత రెండు రోజులుగా స్వయంగా ఆరా తీస్తున్నారు. పార్టీ ప్రతినిధులు, నేతలకు ఫోన్లు చేసి వివరాలు తెలుసుకుంటున్నారు. సభ్యత్వ నమోదు ఎలా సాగుతోంది? పార్టీ శ్రేణులు ఎలా పనిచేస్తున్నాయి? ప్రజా స్పందన ఎలా ఉందనే అంశాలపై సమాచారం సేకరించారు. మరింత ఉత్సాహంగా సభ్యత్వ నమోదుల్లో పాల్గొనాలని నేతలకు సీఎం సూచించారు. చివరి వరకు దీనిపైనే దృష్టి సారించాలన్నారు.
పండుగలా సభ్యత్వ నమోదు సాగాలి: కేసీఆర్ - KCR Review on Trs Party MemberShip Programme
గత నెల 27నుంచి రాష్ట్రవ్యాప్తంగా తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. పార్టీ నేతలతో సీఎం కేసీఆర్ సభ్యత్వ నమోదుపై గత రెండు రోజుల నుంచి ఆరా తీస్తున్నారు. ఈ నెల 20న తుది గడువు వరకు దృష్టి సారించాలని కార్యకర్తలకు సూచించారు.
పండుగలా సభ్యత్వ నమోదు సాగాలి: కేసీఆర్
TAGGED:
KCR