కష్టంలో కన్నీళ్లు పంచుకునే వారే ఇప్పుడు కావాలని ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు సందేశమిచ్చారు. ఒకరికొకరు ధైర్యం, ప్రోత్సాహం ఇచ్చుకోవాలని... నిరంతరం శ్రమిస్తున్న వైద్య సిబ్బందికి పొగిడే నోళ్లు కావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారికోసం 8 ఆసుపత్రులు నోటిఫై చేశామని కేసీఆర్ తెలిపారు. 25వేల మంది అదనపు వైద్య సిబ్బంది సిద్ధంగా ఉన్నారని సీఎం పేర్కొన్నారు. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేస్తున్న వైద్య సిబ్బందికి ప్రోత్సాహకం అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.
ఇదే స్ఫూర్తితో పనిచేయండి..
ఐసోలేషన్ కేంద్రాలు మొదలుకొని ప్రతి వీధి, వాడలో అవసరమైన రసాయలను పిచికారీ చేస్తూ అద్దంలా ఉంచుతున్నారని.. పారిశుద్ధ్య కార్మికులకు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులకూ.. ప్రోత్సాహకం అందిస్తామని.. వారు ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ముఖ్యమంత్రి కోరారు.