తెలంగాణ

telangana

ETV Bharat / state

మోదీ ప్రభుత్వాన్ని పారద్రోలితేనే బాగుపడతాం - CM KCR Live Updates

KCR Participating in Inauguration of Integrated District Offices Complex at Rangareddy Dist
కాసేపట్లో రంగారెడ్డి కలెక్టరేట్‌ ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌

By

Published : Aug 25, 2022, 3:30 PM IST

Updated : Aug 25, 2022, 4:46 PM IST

16:45 August 25

మోదీ ప్రభుత్వాన్ని పారద్రోలితేనే మనం అన్ని రంగాల్లో బాగుపడతాం

  • దిల్లీలో 25 కోట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తామని అంటున్నారు
  • బిహార్‌, దిల్లీ, బెంగాల్‌లో ఏం జరుగుతుందో ఆలోచన చేయాలి
  • మోదీ ఆగం చేస్తున్నారు
  • నా ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం కానివ్వను
  • మత పిచ్చిగాళ్లు ఎలాంటి దుర్మార్గాలను సాగనివ్వం
  • మత పిచ్చికి లోనైతే...బతుకులు ఆగమౌతాయి
  • స్వార్థ మతపిచ్చిగాళ్లను తరమికొట్టాలి
  • సమాజంలో అసూయ, ద్వేషం పెరిగితే భారత్‌, తెలంగాణ 100ఏళ్లు వెనక్కి వెళ్తుంది
  • కృష్ణా జలాల్లో వాటా తేల్చడం మోదీకి చేతకాదు
  • మోదీ....మేము మనుషులం కాదా? దేశంలో భాగం కాదా?
  • కేంద్రం నుంచి మోదీ ప్రభుత్వాన్ని పారద్రోలితేనే మనం అన్ని రంగాల్లో బాగుపడతాం
  • జాతీయ రాజకీయాల్లో ఉజ్వల పాత్ర నిర్వహిస్తాం

16:37 August 25

మోదీయే రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేస్తున్నారు

  • పంటలు పండే తెలంగాణ కావాలా? మత పిచ్చితో మంటలు మండే తెలంగాణా కావాలా?
  • పంటలు పండే తెలంగాణ కావాలి.. మంటలు మండే తెలంగాణ వద్దనే భావన అందరిలో ఉండాలి
  • రాష్ట్రంతోపాటు దేశం బాగుండాలి
  • దేశం బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుంది
  • కేంద్రం ఇప్పటి వరకు ఒక్క మంచి పనిచేయలేదు
  • ముఖ్యమంత్రిగా నేను ప్రధానిగా మోదీ ఒకేసారి అయ్యాం
  • 24 గంటల విద్యుత్‌ సరఫరా తెలంగాణలో చేస్తున్నప్పుడు దేశంలో ఎందుకు ఇవ్వడం లేదు
  • మోదీయే రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేస్తున్నారు
  • స్టాలిన్‌, కేజ్రీవాల్‌, మమత బెనర్జీ ప్రభుత్వాలను కూల్చేస్తామని మాట్లాడుతున్నారు.. ఇది ప్రజాస్వామ్యమా?
  • మోదీ ప్రభుత్వ చర్యలను మౌనంగా భరిద్దామా? పిడిగిలి బిగించి కొట్లాడుదామా?

15:33 August 25

  • తెలంగాణ ఉద్యమ సమయంలో తప్పుడు ప్రచారం చేశారు: సీఎం కేసీఆర్‌
  • రంగారెడ్డి జిల్లాలో భూముల ధరలు పడిపోతాయని అన్నారు: సీఎం కేసీఆర్‌
  • విద్యుత్‌, సాగునీరు, తాగునీరు ఇవ్వని వాళ్లే తప్పుడు ప్రచారం చేశారు: సీఎం కేసీఆర్‌
  • 15ఏళ్లు పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాం: సీఎం కేసీఆర్‌
  • ఏ ప్రాంతంలో మేధావులు, విద్యాధికులు, యువత ఏమరపాటుగా ఉంటారో అక్కడ చాలా బాధలు అనుభవించాల్సి వస్తుంది: సీఎం కేసీఆర్‌
  • అందుకు తెలంగాణ చరిత్రే ఉదాహరణ: సీఎం కేసీఆర్‌
  • చిన్న ఏమరపాటు వల్ల 58 ఏళ్లు తెలంగాణ కోసం పోరాటం చేయాల్సి వచ్చింది: సీఎం కేసీఆర్‌

15:23 August 25

రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించిన కేసీఆర్‌

  • రంగారెడ్డి జిల్లా నూతన కలెక్టరేట్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్
  • రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించిన కేసీఆర్‌

14:51 August 25

CM KCR Live Updates

  • కాసేపట్లో రంగారెడ్డి కలెక్టరేట్‌ కొత్త భవన సముదాయం ప్రారంభం
  • రంగారెడ్డి కలెక్టరేట్‌ ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌
  • అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం కేసీఆర్‌
  • కొంగరకలాన్‌లో 44 ఎకరాల్లో రూ.58 కోట్లతో కలెక్టరేట్ నిర్మాణం
Last Updated : Aug 25, 2022, 4:46 PM IST

ABOUT THE AUTHOR

...view details