తెలంగాణ

telangana

ETV Bharat / state

KCR Nutrition Kit: కాబోయే అమ్మలకు అండగా.. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ - Distribution of KCR Nutrition Kits across state

KCR Nutrition Kits To Pregnant womens : రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 14వ తేదీన 24 జిల్లాల్లోని గర్భిణులకు పౌష్టికాహార కిట్లను పంపిణీ చేయనుంది. తద్వారా 6.84 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరుతుంది.

Kcr Nutrician Kits
Kcr Nutrician Kits

By

Published : Jun 9, 2023, 12:41 PM IST

KCR Nutrition Kit Distributed across Telangana : రాష్ట్రవ్యాప్తంగా గర్భిణులకు పౌష్టికాహారం అందించే ప్రత్యేక పథకాన్ని వైద్యారోగ్య శాఖ అమలు చేయనుంది. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా.. 24 జిల్లాల్లో కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌లను పంపిణీ చేయనుంది. గర్భిణుల్లో పౌష్టికాహార లోపాన్ని అధిగమించడంతో పాటు మాతాశిశు సంరక్షణే లక్ష్యంగా ఈ కార్యక్రమం అమలు కానుంది. సుమారు ఏడు లక్షల మంది మహిళలకు ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో రూ.274 కోట్లను ప్రభుత్వం వెచ్చించనుంది.

ప్రధానంగా మాతృ మరణాల రేటు తగ్గింపులో.. కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్లు కీలకంగా మారుతాయని వైద్యారోగ్యశాఖ భావిస్తోంది. ఈ నెల 14న రాష్ట్రవ్యాప్తంగా 24 జిల్లాల్లో ఇప్పటికే గుర్తించిన గర్భిణులకు పౌష్టికాహార కిట్‌లను అందించనున్నారు. తెలంగాణలో ఇప్పటికే మహిళల్లో రక్తహీనత అధికంగా ఉన్న భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కుమురం భీం ఆసిఫాబాద్‌, ములుగు, ఆదిలాబాద్‌, నాగర్‌కర్నూల్‌, వికారాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 1.25 లక్షల మంది గర్భిణులకు రెండు పర్యాయాలుగా రెండున్నర లక్షల కిట్లు పంపిణీ చేశారు. ఈ తొమ్మిది జిల్లాల్లో పథకం ప్రయోజనాలపై రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ అధ్యయనం చేసింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పేద మహిళలకు ఇది చాలా ఉపయోగకరమైన కార్యక్రమంగా అందులో వెల్లడైంది.

Distribution of KCR Nutrition Kits across State : స్త్రీల నుంచి సానుకూల స్పందన రావడంతో పాటు.. ప్రధాన సమస్య అయినా రక్తహీనత చాలావరకు పరిష్కారమైనట్లు గుర్తించారు. గ్రామీణ మహిళలతో పాటు నగరాలు, పట్టణాలల్లోనూ మహిళల్లో రక్తహీనత ఎక్కువగా ఉంటోందని అధ్యయనంలో తేలింది. ఏడు కంటే కూడా తక్కువ హిమోగ్లోబిన్‌ శాతం ఉంటుండటంతో.. ఇది గర్భిణుల ఆరోగ్యంతో పాటు జన్మించే శిశువు ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక అధ్యయనం అనంతరం.. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అన్ని జిల్లాల్లో న్యూట్రిషన్‌ కిట్‌ల పథకం అమలుకు నిర్ణయించింది.

రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.84 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరుతుంది. రెండు విడతలుగా కిట్‌లను అందించనున్నారు. తొలుత గర్భిణికి 14 నుంచి 26 వారాల సమయంలో ఒకసారి.. 27 నుంచి 34 వారాల సమయంలో మరోసారి పంపిణీ చేయనున్నారు. రాష్ట్రంలో మాతృ మరణాలు లక్షకు 43 నమోదవుతుండగా.. దేశంలో మూడో స్థానంలో ఉంది.

KCR Nutrition Kits across State : రాష్ట్రంలో తొమ్మిది సంవత్సరాలలో మాతృ మరణాలు 92 నుంచి 43కు తగ్గాయని.. మరింత తగ్గించేందుకు చేపడుతున్న కార్యక్రమాల్లో కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌ల పంపిణీ కీలకమని రాష్ట్ర కుటుంబ సంక్షేమశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గర్భిణులకు ఖనిజాలు, విటమిన్లు, ప్రొటీన్లు, ఐరన్‌ అందించి రక్తహీనత తగ్గించడం, హీమోగ్లోబిన్‌ శాతం పెంచడం న్యూట్రిషన్‌ కిట్ల లక్ష్యమని పేర్కొన్నారు. ఒక్కో కిట్‌కు రూ.2,000 వ్యయం కానుండగా.. రాష్ట్రవ్యాప్తంగా పంపిణీకి రూ.274 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినట్లు వివరించారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details