ఆర్టీసీపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష
17:07 November 01
ఆర్టీసీపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష
ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు సమీక్ష నిర్వహించారు. మంత్రులు అజయ్, ప్రశాంత్ రెడ్డితోపాటు అధికారులతో ప్రగతి భవన్లో సీఎం సమావేశమయ్యారు. ఆర్టీసీ సమ్మె, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, హైకోర్టులో జరిగిన విచారణ తదితర అంశాలపై సీఎం సమీక్షించారు. విచారణ సందర్భంగా న్యాయస్థానం లేవనెత్తిన అంశాలను అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ధర్మాసనం ముందు ఉంచాల్సిన అంశాలపై చర్చించారు. సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చేయాల్సిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు.
రేపు జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఆర్టీసీకి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. 20 శాతం ప్రైవేటు బస్సులకు స్టేజ్ క్యారియర్లుగా అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన విధి విధానాలపై కూడా సీఎం కేసీఆర్ అధికారులతో చర్చించినట్లు సమాచారం.