దిశ హత్యోదంతం నేపథ్యంలో చట్టాల్లో మార్పు చేసి కఠిన శిక్షలు అమలు చేసేలా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ కోరనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి సోమవారం రాత్రి దిల్లీకి చేరుకున్నారు. ఇవాళ ప్రధానిని కలిసేందుకు సమయం కోరారు. అనుమతి లభిస్తే దిశ హత్యోదంతం, విభజన హామీల అమలు, ఆర్టీసీ పరిణామాలను ప్రధానికి వివరించొచ్చని సమాచారం.
తొమ్మిది, పదో షెడ్యూల్ ఆస్తులు-అప్పుల బదలాయింపు, బయ్యారం ఉక్కు కార్మాగారం, హైదరాబాద్‌లో ఎక్స్‌ప్రెస్ హైవేల నిర్మాణానికి రక్షణ శాఖ భూముల బదలాయింపు వంటి అంశాలను కేసీఆర్ ప్రస్తావించే అవకాశముంది. మిషన్ భగీరథకు నిధులు, కాళేశ్వరానికి జాతీయ హోదా, వరంగల్ మెగా జౌళి పార్కుకు కేంద్రం నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తారని తెలుస్తోంది. దిల్లీ పర్యటనలో కొందరు కేంద్ర మంత్రులను కూడా కలిసేందుకు సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం.
చట్టాల 'దిశ' మార్చండి.. కేంద్రాన్ని కోరనున్న సీఎం - దిశ హత్యోదంతం
సీఎం కేసీఆర్ సోమవారం రాత్రి దిల్లీకి చేరుకున్నారు. ఇవాళ ప్రధానితో కేసీఆర్ భేటీ అయ్యే అవకాశముంది. దిశ హత్యోదంతం నేపథ్యంలో చట్టాల్లో మార్పు చేసి కఠిన శిక్షలు అమలయ్యేలా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని మోదీని సీఎం కోరనున్నట్లు సమాచారం.
చట్టాల 'దిశ' మార్చండి.. కేంద్రాన్ని కోరనున్న సీఎం
Last Updated : Dec 3, 2019, 9:31 AM IST