రాజ్ భవన్లో గవర్నర్ నరసింహన్తో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం అయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అంశాన్ని గవర్నర్కు కేసీఆర్ వివరించారు. పాలనలో నూతనంగా తీసుకు రానున్న సంస్కరణలు, రెవెన్యూ, మున్సిపల్ కొత్త చట్టాలపై చర్చించినట్లు సమాచారం.
గవర్నర్ను కలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ - గవర్నర్ నరసింహన్
పాలనలో నూతన సంస్కరణలు, కొత్త మున్సిపల్, రెవెన్యూ చట్టాలు వంటి అంశాలపై సీఎం కేసీఆర్ గవర్నర్ను కలిసి చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికలు, తాజా రాజకీయ పరిణామాలను సీఎం గవర్నర్కు వివరించారు.
సీఎం కేసీఆర్