KCR on Allurisitaramaraju movie:ప్రముఖ నటుడు, సూపర్‌స్టార్ కృష్ణ (79) మంగళవారం వేకువజామున కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఆయన మృతిపట్ల రాజకీయ, సినీప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ స్వయంగా వెళ్లి కృష్ణ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాడసానుభూతి తెలిపారు. మహేశ్‌బాబును ఓదార్చారు. అనంతరం మీడియాతో కృష్ణ గురించి మాట్లాడురు.
కేసీఆర్‌కు అభిమాన హీరో కృష్ణ.. ఆ చిత్రాన్ని ఎన్నో సార్లు చూశారట! - KCR Comments on Alluri Sitarama Raju movie
KCR on Allurisitaramaraju movie: తెలంగాణ సీఎం కేసీఆర్... కృష్ణ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... తాను కృష్ణ అభిమానినని తెలిపారు. ఆయన నటించిన చిత్రాల్లో అల్లూరి సీతారామరాజు చిత్రం ఎన్నో సార్లు చూసినట్లు తెలిపారు. సినీ పరిశ్రమ గొప్ప విలక్షణ నటుడిని కోల్పోయినట్లు తెలిపారు.
గొప్ప విలక్షణ నటుడు కృష్ణ.. ఆ చిత్రాన్ని ఎన్నో సార్లు చూశా: కేసీఆర్
అయితే గతంలో కూడా సీఎం కేసీఆర్.. తాను కృష్ణకు పెద్ద ఫ్యాన్‌ను అన్నట్లు తెలిపారు. ఆయన చిత్రాలను చూసేవారట. అందులో అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని ఎన్నో సార్లు చూసినట్లు ఇంతకుముందే తెలిపారు. ఈరోజు కూడా ఆయన మాట్లాడుతూ... అల్లూరి సీతారామరాజు చిత్రం చాలాసార్లు చూశానని పునరుద్ఘాటించారు. కృష్ణ ఎన్నో సందేశాత్మక చిత్రాలు తీశారని కొనియాడారు. ఇక ఆయన ఇంటికి 2,3 సార్లు వెళ్లినట్లు గుర్తు చేసుకున్నారు.
ఇవీ చూడండి:
Last Updated : Nov 15, 2022, 4:35 PM IST