24న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ! - TRS
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్లు ఈనెల 24న సమావేశం కానున్నట్లు సమాచారం. ఈ భేటీలో గోదావరి జలాలు శ్రీశైలానికి తరలింపు, విభజన అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో గోదావరి నీటిని శ్రీశైలం జలాశయానికి తరలించే వ్యూహం ఖరారు చేయాలని ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఇరు రాష్ట్రాల అధికారులు, ఇంజినీర్లకు ఇందులో అవకాశం కల్పించారు. ఎక్కడి నుంచి ఎలా నీరు తరలించాలన్న విషయంపై నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించారు. ఈ అంశంపై కూడా చర్చించనున్నట్లు సమాచారం.
![24న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4494418-822-4494418-1568914761814.jpg)
beti
.