సీఎం కేసీఆర్ చేసినన్ని యాగాలు, యజ్ఞాలు ఎవరూ చేయలేదని రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు తెలిపారు. నిజమైన హిందువు కేసీఆరే అని... ముఖ్యమంత్రిని మించిన హిందువు ఎవరూ లేరన్నారు. మనుషులంతా ఒకటే అన్నది తెరాస విధానమని స్పష్టం చేశారు.
కేసీఆర్ చేసినన్ని యాగాలు, యజ్ఞాలు ఎవరూ చేయలేదు: కేకే - సీఎం కేసీఆర్ తాజా వార్తలు
నిజమైన హిందువు కేసీఆరే అని రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు అన్నారు. సీఎం కేసీఆర్ చేసినన్ని యాగాలు, యజ్ఞాలు ఎవరూ చేయలేదని హైదరాబాద్లో చెప్పారు. ముఖ్యమంత్రిని మించిన హిందువు ఎవరూ లేరని తెలిపారు.
కేసీఆర్ చేసినన్ని యాగాలు, యజ్ఞాలు ఎవరూ చేయలేదు: కేకే
దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేశామన్నారు. బీసీల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చామని చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సీట్ల కేటాయింపులో సామాజిక న్యాయం పాటించామన్నారు. ప్రచారం కోసం విపక్షాలు తెరాస ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని.. అయితే వాస్తవాలు ప్రజలకు తెలుసని కేకే వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి:నాలాల ఆధునీకరణతోనే రోడ్ల సమస్యకు పరిష్కారం: కేటీఆర్