KCR Interesting Comments on Dharani Portal : హైదరాబాద్ ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో.. భువనగిరి డీసీసీ అధ్యక్షుడు అనిల్‌కుమార్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరారు. సీఎం.. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. భారత్ రాష్ట్ర సమితి ఒక లక్ష్యంతో ఏర్పాటైన పార్టీ అని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అవమానాలు, అవహేళనలు ఎదుర్కొని నిలబడ్డామని.. పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పారు. తెలంగాణ రాకముందు విద్యుత్ లేక.. పొలాలు ఎండిపోయేవనికేసీఆర్ గుర్తుచేశారు.
KCR on Dharani Portal : ప్రస్తుతం 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని.. దేశంలో ఎక్కడా లేని విధంగా కరెంట్ ఇస్తున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్ 3 గంటల విద్యుత్ అంటే రైతులు తిట్టుకుంటున్నారని చెప్పారు. 24 గంటలు కరెంట్ ఇస్తే ఎవరికి అవసరమైనప్పుడు వారు వాడుకుంటారని వివరించారు. తలసరి ఆదాయంలో దేశంలోనే ప్రథమస్థానంలో ఉన్నామని తెలిపారు. రూ.80,000 కోట్లు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అప్పు ఎప్పుడో తీరిందని కేసీఆర్ వెల్లడించారు.
KCR Latest News : రాష్ట్రంలో వ్యవసాయరంగం అద్భుతంగా ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. ధరణి పోర్టల్ తెచ్చి భూములను డిజిటలైజేషన్ చేశామని.. తద్వారా యజమానులు మాత్రమే భూమి ఇతరులకు మార్చగలరని వివరించారు. తెలంగాణలో భూములు విలువ భారీగా పెరిగాయని.. రైతుల పరిస్థితి మెరుగుపడిందని చెప్పారు. ధరణి ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లోకి నగదు జమ అవుతుందని.. దీనిని తీస్తే రైతుబంధు నిధులు ఎలా జమ అవ్వాలనికేసీఆర్ ప్రశ్నించారు. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో 76 మంది మహారాష్ట్ర సర్పంచ్‌లు బీఆర్ఎస్‌లో చేరారు.