తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏకపక్ష నిర్ణయం తీసుకునే హక్కు కేసీఆర్​కు లేదు: లక్ష్మణ్ - laxman news

ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు భాజపా మద్దతు పలికింది. కార్మికులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన సీఎం నిర్ణయాన్ని ఆ పార్టీ తప్పుపట్టింది.

ఆర్టీసీ కార్మికులు

By

Published : Oct 7, 2019, 5:44 AM IST

ఆర్టీసీ కార్మికులను తొలగిస్తున్నట్టు ప్రకటించిన సీఎం కేసీఆర్‌ నిర్ణయాన్ని భాజపా ఖండించింది. ముఖ్యమంత్రి నిర్ణయం కార్మికులను రెచ్చగొట్టే విధంగా ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మండిపడ్డారు. ఏ కారణం లేకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకునే హక్కు కేసీఆర్​కు లేదని మండిపడ్డారు. భారత్​ ప్రజాస్వామ్య దేశమని.. సీఎం మర్చిపోయినట్టు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఉద్యోగుల తొలగింపు నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణం ఉపసంహరించుకోవాలని... లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని లక్ష్మణ్‌ హెచ్చరించారు.

ఆర్టీసీకి మద్దతుగా లక్ష్మణ్

ABOUT THE AUTHOR

...view details