ప్రతిగ్రామానికి, ప్రతి ఎకరానికి నీళ్లందించే రోజు దగ్గరలోనే ఉందని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. 90శాతం కాళేశ్వరం పనులు పూర్తయ్యాయని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం నూతన పథకాలు ప్రవేశపెట్టారని కొనియాడారు. సిద్దిపేట ఆర్డీవో కార్యాలయంలో సిద్దిపేట రూరల్, అర్బన్, చిన్నకోడూర్ మండలాలకు చెందిన రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందజేశారు. పెండింగ్‌లో ఉన్న భూసమస్యలను పరిష్కరించాలని తహశీల్దార్లను ఆదేశించారు.
రైతు'బంధు'వు కేసీఆర్ - కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు అన్నదాతలకు ఎంతో లబ్ధి చేకూరుస్తాయని మాజీ మంత్రి హరీశ్ తెలిపారు. సిద్దిపేటలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఎమ్మెల్యే హరీశ్‌రావు