తెలంగాణ

telangana

ETV Bharat / state

కేసీఆర్​కు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపిన ఏపీ ఫ్యాన్స్ - కేసీఆర్ జన్మదిన వేడుకలు

మన రాష్ట్ర ముఖ్యమంత్రి పుట్టినరోజుకు... పక్క రాష్ట్ర ప్రజలు వినూత్నంగా శుభాకాంక్షలు చెప్తే కిక్కే వేరప్పా అంటున్నారు కేసీఆర్ అభిమానులు. బుధవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్​లోని కడియంకు చెందిన నర్సరీ నిర్వాహకులు వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

kcr-fans-special-wishes-to-telangana-cm-kcr-at-kadiyam-in-andhra-pradesh
కేసీఆర్​కు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపిన ఏపీ ఫ్యాన్స్

By

Published : Feb 16, 2021, 7:52 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని... ఆంధ్రప్రదేశ్​లోని తూర్పు గోదావరి జిల్లా కడియంలోని పల్ల వెంకన్న నర్సరీ నిర్వాహకులు వినూత్నంగా తమ అభిమానాన్ని చాటుకున్నారు. జిల్లా వాసులు పల్ల సత్తిబాబు, పల్ల సుబ్రహ్మణ్యం, పల్ల గణపతి రంగురంగుల పూలు, పూలమొక్కలతో కేసీఆర్ చిత్రపటాన్ని సృజనాత్మకంగా తీర్చిదిద్ది... జన్మదిన శుభాకంక్షలు తెలిపారు.

తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్ ప్రారంభించిన హరితహారం కార్యక్రమంతో ప్రేరణ పొందామని వెల్లడించారు. అందుకే మొక్కలతోనే తెలంగాణ ముఖ్యమంత్రికి వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపామని పేర్కొన్నారు. తెలంగాణేతర ప్రజలు సైతం కేసీఆర్​కు జన్మదిన శుభాకాంక్షలు తెలపడం పలువురిని ఆకర్షించింది.

ఇదీ చూడండి:'సల్లంగుండు బిడ్డా... కేసీఆర్'.. సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు

ABOUT THE AUTHOR

...view details