KCR Election Campaign Today :బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రికేసీఆర్ (KCR) మలివిడత ఎన్నికల ప్రచారం ఇవాళ మొదలు కానుంది. 100 నియోజకవర్గాల్లో ప్రచారం లక్ష్యంగా పెట్టుకున్న గులాబీ దళపతి.. రోజుకు రెండు, మూడు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. నేటి నుంచి నవంబరు 9 వరకు 35 సభల్లో ప్రసంగించనున్నారు . ఇవాళ అచ్చంపేట, వనపర్తి, మునుగోడులో ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటారు.
CM KCR Second PhaseElection Campaign Today :ఈనెల 15న బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రకటించి.. అభ్యర్థులకు బీ ఫాంలు ఇచ్చి.. అదే రోజున ప్రచారంలోకి దిగారు. పార్టీ అభ్యర్థులకు బీ ఫాంలు ఇవ్వడంతో పాటు.. హుస్నాబాద్‌లో ప్రచార భేరీ మోగించారు. రోజుకు రెండు నియోజకవర్గాల చొప్పున.. ఈనెల 18 వరకు హుస్నాబాద్, జనగామ, భువనగిరి, సిరిసిల్ల, సిద్ధిపేట, జడ్చర్ల, మేడ్చల్‌లో సభలు పూర్తి చేశారు. బతుకమ్మ, నవరాత్రులు, దసరా పండగ దృష్ట్యా మధ్యలో విరామం ఇచ్చిన కేసీఆర్.. నేటి నుంచి రెండో విడత ప్రచారానికి బయలుదేరనున్నారు.
BRS Praja Ashirvada Sabha Wanaparthy : రెండో విడతలో రోజుకు దాదాపు మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఇవాళ అచ్చంపేట, వనపర్తి, మునుగోడులో సభలు నిర్వహించి.. శుక్రవారం పాలేరు, మహబూబాబాద్, వర్దన్నపేటలో.. శనివారం కోదాడ, తుంగతుర్తి, ఆలేరు సభల్లో పాల్గొంటారు. ఈనెల 30న జుక్కల్, బాన్సువాడ, నారాయణఖేడ్,.. 31న హుజూర్‌నగర్, మిర్యాలగూడ, దేవరకొండలో ప్రజాశీర్వాద సభలు జరగనున్నాయి. నవంబరు 1న సత్తుపల్లి, ఇల్లందు,.. 2న నిర్మల్, బాల్కొండ, ధర్మపురి,.. 3న భైంసా, ఆర్మూర్, కోరుట్లలో కేసీఆర్ సభలు నిర్వహిస్తారు.
Telangana Assembly Elections 2023 : నవంబరు 5న కొత్తగూడెం, ఖమ్మం,.. 6న గద్వాల, మక్తల్, నారాయణపేట, 7వ తేదీన చెన్నూరు, మంథని, పెద్దపల్లి, 8న సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లిలో కేసీఆర్ ప్రచార సభల్లో ప్రసంగించనున్నారు. నవంబరు 9న గజ్వేల్, కామారెడ్డిలో ముఖ్యమంత్రి నామినేషన్లు వేయనున్నారు. అదే రోజున కామారెడ్డి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ప్రజాశీర్వాద సభలకు బీఆర్ఎస్ భారీగా జనసమీకరణ చేస్తోంది. ప్రతీ సభకు కనీసం లక్ష మందిని తరలించేలా లక్ష్యంగా పెట్టుకుంది.