తెలంగాణ

telangana

ETV Bharat / state

7న కేసీఆర్​ అధ్యక్షతన తెరాస కార్యవర్గ సమావేశం - టీఆర్​ఎస్​ కార్యవర్గ సమావేశం

7న కేసీఆర్​ అధ్యక్షతన తెరాస కార్యవర్గ సమావేశం
7న కేసీఆర్​ అధ్యక్షతన తెరాస కార్యవర్గ సమావేశం

By

Published : Feb 5, 2021, 12:42 PM IST

Updated : Feb 5, 2021, 1:34 PM IST

12:38 February 05

7న కేసీఆర్​ అధ్యక్షతన తెరాస కార్యవర్గ సమావేశం

 ఈనెల 7న తెరాస రాష్ట్ర కార్యవర్గం సమావేశం కానుంది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్​ అధ్యక్షతన తెరాస రాష్ట్ర కార్యవర్గం భేటీ జరుగనుంది. ఈ సమావేశానికి రాష్ట్ర కమిటి సభ్యులతో పాటు మంత్రులు, లోక్‌సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ ఛైర్‌పర్సన్లు, జడ్పీఛైర్‌పర్సన్లు, మున్సిపల్ మేయర్లు, డీసీసీబీ అధ్యక్షులు, డీసీఎంఎస్​ అధ్యక్షులను ఆహ్వానించారు.

 పార్టీ సభ్యత్వాల పునరుద్ధరణ, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీల నియామకం, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎన్నిక, ఏప్రిల్ 27న వార్షిక మహాసభ, ఇతర సంస్థాగత అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చిస్తారు.

ఇదీ చూడండి:నీటిపారుదల శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

Last Updated : Feb 5, 2021, 1:34 PM IST

ABOUT THE AUTHOR

...view details